Category : ఆంధ్రప్రదేశ్ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2025-04-04 11:43:34
తెలుగు వెబ్ మీడియా న్యూస్:- మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లిలో గత పదిహేనేళ్లుగా కొండవాలు ప్రాంతంలో నివసిస్తున్న రాజమండ్రి గోవిందు కుటుంబానికి మంత్రి లోకేష్ ఇంటికెళ్లి బట్టలు పెట్టి శాశ్వత పట్టాను అందజేశారు. మంగళగిరిలో పాదయాత్ర నిర్వహించిన సమయంలో ఇక్కడ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం కీలకమైన హామీ నెరవేర్చానన్నారు.
దశాబ్ధాల సమస్యను 10నెలల్లో పరిష్కరించానని, అహర్నిశలు కష్టపడి మంగళగిరి ప్రజల మనసు గెలిచానన్నారు ఏపీ మంత్రి నారా లోకేష్. ఉండవల్లిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో మంగళగిరిలో జేసీబీ పాలన చూశామన్న లోకేశ్, ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక దశాబ్ధాలుగా ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న వారికి ఉచితంగా శాశ్వత పట్టాలు అందించామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఉండవల్లిలో తొలిపట్టాను అందజేశానని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు.
మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లిలో గత పదిహేనేళ్లుగా కొండవాలు ప్రాంతంలో నివసిస్తున్న రాజమండ్రి గోవిందు కుటుంబానికి మంత్రి లోకేష్ ఇంటికెళ్లి బట్టలు పెట్టి శాశ్వత పట్టాను అందజేశారు. మంగళగిరిలో పాదయాత్ర నిర్వహించిన సమయంలో ఇక్కడ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం కీలకమైన హామీ నెరవేర్చానన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో అటవీ, దేవాదాయ, రైల్వే, ఇరిగేషన్ భూముల్లో స్థానిక ప్రజలు దశాబ్ధాలుగా ఇళ్లు నిర్మించుకొని జీవనం సాగిస్తున్నారు. వీరిని వేరే ప్రాంతాలకు పంపితే అక్కడకు వెళ్లి ఇల్లు నిర్మించుకోవడం ఎంతో వ్యయప్రయాసలతో కూడిన పని. అందుకే వారి కష్టాలు చూశాకే అధికారంలోకి వచ్చాక బట్టలు పెట్టి మరీ శాశ్వత పట్టాలు ఇస్తానని చెప్పానన్నారు. ఆ హామీని ఈరోజు నెరవేర్చుతున్నందుకు ఆనందంగా ఉందన్న లోకేష్.. తొలివిడతగా 3వేలమంది శాశ్వత పట్టాలు అందజేస్తున్నామని తెలిపారు.
2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి తొలిసారి పోటీచేసి 5,300 ఓట్లతేడాతో ఓడిపోయానని, మొదటి రోజు బాధపడ్డా, రెండో రోజునుంచి మంగళగిరి ప్రజల మనసు గెలిచేందుకు ప్రయత్నించానన్నారు. గత అయిదేళ్లుగా సొంత నిధులతో నియోజకవర్గంలో 26 సంక్షేమ కార్యక్రమాలు అమలుచేశామని తెలిపారు. ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఉచిత తాగునీటి ట్యాంకర్లు, సొంత డబ్బుతో ఉచితంగా గ్రావెల్ రోడ్ల నిర్మాణం, కరోనా సమయంలో ఆక్సిజన్, టెలీ మెడిసిన్ సేవలు, వైద్యసేవల కోసం ఎన్టీఆర్ సంజీవని ఆరోగ్య రథాలు, యువత కోసం మంగళగిరి ప్రీమియర్ లీగ్, ప్రతి గ్రామానికి స్పోర్ట్స్ కిట్స్ ఇచ్చాం. మంగళగిరి ప్లేగ్రౌండ్స్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో 50వేల మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారని, మంగళగిరి చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో 3వ అతి పెద్ద మెజారిటీ 91వేలతో నన్ను గెలిపించారు. ఈ ఘనవిజయంతో నాలో కసి, బాధ్యత పెరిగిందన్నారు.
రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకంగా స్వచ్చ మంగళగిరి కార్యక్రమం నిర్వహిస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు. ఇందులో భాగంగా పార్కులు, ప్లేగ్రౌండ్లు, రైతు బజార్లు అభివృద్ధి చేస్తున్నామన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, పైప్ లైన్ ద్వారా గ్యాస్ వంటి ప్రాజెక్టులు సిద్ధమవుతున్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా శ్మశాన వాటికలు అభివృద్ధి చేస్తున్నాం. మంగళగిరిలో మోడరన్ రైతుబజార్ నిర్మాణం, లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆధునీకరణ, మంగళగిరి ప్రజల కల అయిన వంద పడకల హాస్పటల్ ను దేశంలోనే ప్రతిష్టాత్మకంగా నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. త్వరలో వందపడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తాం. స్థానిక సంస్థల నిధులు, సిఎస్ ఆర్ ఫండ్స్ తో గత పదినెలల్లో మంగళగిరి నియోజకవర్గంలో 50 అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని మంత్రి లోకేష్ తెలిపారు.