Category : సినిమా | Sub Category : సినిమా Posted on 2025-04-04 10:46:58
తెలుగు వెబ్ మీడియాన్యూస్:- సారా అలీఖాన్సై ఫ్ అలీ ఖాన్ము ద్దుల కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ట్రై చేస్తోంది. ఆల్రెడీ స్కై ఫోర్స్ సినిమాతో అందరినీ మెప్పించిన సారా ఆ సినిమాతో అందరి మనసులు గెలుచుకుంది. కాగా రీసెంట్ గా సారా ఓ ఇంటర్వ్యూలో పాల్లొని కొన్ని ఆసక్తికర వివరాలను వెల్లడించింది.కెరీర్ మొదలుపెట్టినప్పుడు తనపై నెట్టింట చాలా ట్రోలింగ్ జరిగిందని, తన నటన గురించి ఎంతో మంది విమర్శించేవారనీ, అయినప్పటికీ తాను ఎప్పుడూ ఆ విమర్శలను పట్టించుకోలేదని సారా చెప్పింది. ఈ సమస్య నుంచి బయటపడటానికి తనకు ధ్యానం ఎంతో ఉపయోగపడిందని, ధ్యానం చేయడం వల్ల తన ఆలోచనా విధానంతో పాటూ అసలు నిజమేంటో కూడా అర్థమవుతుందని సారా తెలిపింది.ప్రతీ ఒక్కరూ అందరికీ నచ్చాలని రూల్ లేదని, కొంతమందికి కొందరు నచ్చితే, ఇంకొందరికీ వాళ్లు నచ్చరని, దేవుడు అవకాశమిస్తే ఫ్యూచర్ లో మరింత కాలం హీరోయిన్ గా కొనసాగాలనుకుంటున్నానని చెప్పిన సారా ప్రస్తుతం మెట్రో ఇన్ డినో అనే మూవీ చేస్తోంది. జులై 4న రిలీజ్ కానున్న ఈ సినిమాకు అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తున్నాడు.