Category : అంతర్జాతీయ | Sub Category : వార్తలు Posted on 2025-04-04 10:45:15
తెలుగు వెబ్ మీడియా న్యూస్: చూయింగ్ గమ్ ను చాలా మంది నములుతూ ఉంటారు. చిన్న పిల్లలు కూడా చూయింగ్ గమ్ కావాలంటూ మారం చేస్తారు. కొంత మంది పెద్ద వాళ్లకు కూడా చూయింగ్ గమ్ తినడం ఒక అలవాటుగా మారుతుంది. ఊరికే సరదాగా నములుతూ ఉంటారు. ఇలా చూయింగ్ గమ్ నమలడం అలవాటు ఉన్న వాళ్ల ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాలి. చూయింగ్ గమ్ తినే వాళ్లు ప్లాస్టిక్‌ను తింటున్నట్లే అంటున్నారు నిపుణులు. లాస్ ఏంజిల్స్‌లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం ఇటీవల చేసిన పరిశోధన ప్రకారం.. చూయింగ్ గమ్ నమలడం వల్ల, మీరు తెలియకుండానే కొన్ని వేల మైక్రో ప్లాస్టిక్ ముక్కలను మింగుతున్నట్లు తేలింది. ఈ మైక్రోప్లాస్టిక్‌లు మీ నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తాయి.
మైక్రోప్లాస్టిక్ కణాలు పేగు లైనింగ్ వంటి జీవసంబంధమైన అడ్డంకులను, కొన్ని సందర్భాల్లో రక్తం, మెదడుకు హాని చేస్తాయంట. నాడీ వ్యవస్థపై మరింత తీవ్రమైన ప్రభావం చూపుతాయని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం వెల్లడైన అధ్యయనంలో, ప్రతి గ్రాము గమ్ నుండి 100 మైక్రోప్లాస్టిక్‌లు విడుదలవుతున్నాయని తేలింది. కొన్ని ఉత్పత్తులు గ్రాముకు 600 మైక్రోప్లాస్టిక్‌లను విడుదల చేస్తాయి.