Category : సినిమా | Sub Category : సినిమా Posted on 2025-04-04 10:55:35
తెలుగు వెబ్ మీడియాన్యూస్:- బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందానికి అందం, టాలెంట్ కు టాలెంట్ ఉన్న కరీనా రీసెంట్ గా ముంబై లో ఫేమస్ సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్ రుజుతా దివేకర్రా సిన ది కామన్ సెన్స్ డైట్ అనే బుక్ లాంచ్ కార్యక్రమానికి హాజరైంది.ఈ ఈవెంట్ లో కరీనా తన డైలీ డైట్ మరియు ఫుడ్ హాబిట్స్ గురించి తెలిపింది. తనకు కిచిడీ అంటే ఎంతో ఇష్టమని, రెండు మూడు రోజులు కిచిడీ తినకపోతే వెంటనే తనకు క్రేవింగ్స్ విచ్చేస్తాయని, కిచిడీఅంటే తనకు అంత ఇష్టమని, అది లేకుండా తన బాడీ ఉండలేదని, కిచిడీ తినకపోతే తనకు నిద్ర కూడా పట్టదని కరీనా కపూర్ చెప్పుకొచ్చింది.బియ్యం, పప్పులు, తేలికైన మసాలాలతో చేసే కిచిడీ ఎంత రుచిగా ఉంటుందో అందులో అన్ని పోషక విలువలుంటాయని, తిన్న వెంటనే ఈజీగా డైజెస్ట్ అవుతుందని కూడా కరీనా తెలిపింది. ఇక తన హెల్త్ గురించి మాట్లాడుతూ తాను సరైన డైట్ మెయిన్‌టెయిన్ చేయడం వల్లే ఇప్పటికీ తనకు ఇంత ఫిట్‌నెస్ ఉందని కరీనా వెల్లడించింది.