Category : అంతర్జాతీయ | Sub Category : వార్తలు Posted on 2025-04-04 10:51:52
తెలుగు వెబ్ మీడియా న్యూస్: భూమి వైపు ఓ భారీ గ్రహశకలం దూసుకొస్తుందని, 2032లో అది భూమిని ఢీకొంటుందని కొన్ని నెలల క్రితం ఖగోళ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. దాంతో 2032లో యుగాంతం తప్పదా? అంటూ చాలా మంది ఆందోళన చెందారు. తాజాగా నాసా తన శక్తివంతమైన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ను ఉపయోగించి.. ఈ 2024 వైఆర్4 అనే గ్రహశకలాన్ని పరిశీలించింది. ఈ పరిశీలన తర్వాత.. ఆ గ్రహశకలం భూమిని ఢీ కొట్టే దిశలో రావడం లేదని, దాని దారిని మార్చకోని, చంద్రుడి వైపు దూసుకెళ్తోంది.. 2032లో అది చంద్రుడిని బలంగా ఢీ కొట్టే అవకాశం ఉందంటూ నాసా శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఈ వైఆర్4 అనే గ్రహశకలం ఏకంగా పది అంతస్థుల భవనం అంత భారీ సైజులో ఉంటుందని అంచనా వేశారు.
చంద్రుడిపై శాశ్వత నిర్మాణాలు ఏర్పాటు చేసి, అక్కడ నివశించాలని మనిషి కలలు కంటున్న సమయంలో అంత భారీ సైజులో ఉన్న ఆ గ్రహశకలం చంద్రుడిని ఢీ కొంటే.. పెను విధ్వంసం ఏమైనా సంభవిస్తుందా? చంద్రడు పూర్తి నాశనం అయ్యే ప్రమాదం ఉందా? అని చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ గ్రహ శకలం చంద్రుడిని ఢీ కొంటే కొంత భాగం దెబ్బ తిన్నా.. పూర్తిగా అయితే చంద్రుడు నాశనం అవ్వడని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ గ్రహశకలం కారణంగా చంద్రుడికి పెద్దగా ముప్పు ఏమీ లేదని వెల్లడించారు. వెబ్ టెలిస్కోప్‌తో మే నెలలో మళ్ళీ ఒకసారి ఆ గ్రహశకలాన్ని నాసా పరిశీలించనుంది. ప్రస్తుతం చాలా దూరంలో ఉన్న ఆ గ్రహశకలం వేగంగా ప్రయాణిస్తూ వస్తుంది. దగ్గరికి వస్తున్న కొద్ది దాన్ని పరిశీలించడం తేలిక అవుతుంది.