Responsive Header with Date and Time

లెఫ్ట్‌కు రైట్.. రైట్‌కు లెఫ్ట్..

Category : క్రీడలు | Sub Category : జాతీయ Posted on 2025-04-04 10:44:45


లెఫ్ట్‌కు రైట్.. రైట్‌కు లెఫ్ట్..

తెలుగు వెబ్ మీడియా న్యూస్:-హైదరాబాద్ బౌలర్లు కేకేఆర్ బ్యాటర్ల ముందు చిత్తుగా ఓడిపోయారు. మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ 200 పరుగులు చేసింది. కెప్టెన్ పాట్ కమ్మిన్స్ 4 ఓవర్లలో 44 పరుగులు ఇచ్చాడు. సిమర్జీత్ సింగ్ 47 పరుగులు ఇచ్చాడు. హర్షల్ పటేల్ 4 ఓవర్లలో 43 పరుగులిచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. మహ్మద్ షమీ 4 ఓవర్లలో 29 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు.

ఐపీఎల్ 2025లో భాగంగా 15వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున కమిందు మెండిస్ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఈ శ్రీలంక ఆటగాడు తొలి మ్యాచ్‌లోనే చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో తొలిసారిగా ఒక బౌలర్ రెండు చేతులతో బౌలింగ్ చేశాడు. 13వ ఓవర్లో పాట్ కమ్మిన్స్ బంతిని కమిందు మెండిస్‌కు అందించాడు. ఈ ఆల్ రౌండర్ వచ్చిన వెంటనే అద్భుతం చేశాడు. ఎడమచేతి వాటం వెంకటేష్ అయ్యర్‌కు కుడిచేతితో బౌలింగ్ చేయగా, కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ అంగక్రిష్ రఘువంశీకి ఎడమచేతితో బౌలింగ్ చేసి ఆశ్చర్యపరిచాడు.

కమిందు మెండిస్ తన తొలి ఓవర్లోనే అద్భుతాలు చేశాడు. ఈ ఆటగాడు తన ఐపీఎల్ కెరీర్‌లో మూడవ బంతికే వికెట్ తీసుకున్నాడు. హాఫ్ సెంచరీ చేసి డేంజరస్‌గా మారిన అంగ్క్రిష్ రఘువంశీ వికెట్‌ను మెండిస్ పడగొట్టాడు. అయితే, ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఒకే ఓవర్‌ వేసిన కమిందు కేవలం 4 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. అయితే మెండిస్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ రెండో ఓవర్ వేసే అవకాశం ఇవ్వలేదు.

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Search
Categories
తాజా వార్తలు
Leave a Comment: