Category : తెలంగాణ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2025-04-04 10:43:22
తెలుగు వెబ్ మీడియా న్యూస్:హెచ్‌సీయూ భూముల విషయంలో విద్యార్థుల కు బీజేపీ అండగా ఉంటుందని ఆ పార్టీ ఎంపీ రఘునందన్‌రావు తెలిపారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై హెచ్‌సీయూ విద్యార్థుల పోరాట ఫలితంగానే కోర్టు తీర్పు వచ్చిందన్నారు. యూనివర్సిటీ భూముల పరిరక్షణ కోసం మేం కూడా పోరాడతాం. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం నడుచుకోవాలి. ప్రభుత్వ అనుమతి లేకుండా చెట్లు కొట్టవద్దని వాల్టా చట్టం చెబుతోంది. ఒక్క చెట్టు కొట్టడానికే అనుమతి అవసరమైతే, వందల చెట్లు ఎలా కొట్టారు? మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరని అనుకున్న ప్రభుత్వానికి సుప్రీం తీర్పు చెంపదెబ్బ వంటిది అని పేర్కొన్నారు.