Category : సినిమా | Sub Category : సినిమా Posted on 2025-04-04 10:41:22
తెలుగు వెబ్ మీడియా న్యూస్:- మ్యాడ్, మ్యాడ్ స్వ్కేర్ సినిమాలతో ఆడియన్స్ బాగా ఎంటర్టైన్ అయ్యారు. ఆ రెండు సినిమాల్లో బాగా నవ్వించిన పాత్రల్లో లడ్డూ క్యారెక్టర్ ఒకటి. ఆ క్యారెక్టర్ బాగా పండి కామెడీ వర్కవుట్ అయింది. అయితే లడ్డు అసలు పేరు విష్ణు అతను కమెడియన్ మాత్రమే కాదు మంచి ఫోటోగ్రాఫర్ కూడా. అప్పుడప్పుడు విష్ణు తాను తీసిన ఫోటోలను నెట్టింట షేర్ చేస్తూ ఉంటాడు.ఇదిలా ఉంటే విష్ణు సినిమాల్లోకి వచ్చింది రౌడీ హీరో విజయ్ దేవరకొండ ద్వారా అనే విషయం ఎంతో తక్కువే మందికే తెలుసు. విష్ణు డిగ్రీ కాలేజ్ లో విజయ్ కు సబ్ జూనియర్. తాను జీవితంలో ఏదొకటి చేయాలనుకుని ఆలోచిస్తున్న టైమ్ లోనే విష్ణు షార్ట్ ఫిల్మ్స్, ఫోటోగ్రఫీతో బిజీగా ఉండేవాడని, బయట కూడా చాలా ఫన్నీగా ఉండేవాడని, అందుకే తనకు ఫ్రెండ్ అయ్యాడని విజయ్ ట్యాక్సీవాలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విష్ణు గురించి చెప్పాడు.ట్యాక్సీవాలాలో ఓ పాత్ర కోసం విష్ణు అయితే సరిగా సూటవుతాడనిపించి అతన్ని తీసుకున్నామని, ఫ్యూచర్ లో విష్ణు చాలా మంచి పొజిషన్ లో సెటిల్ అవుతాడని విజయ్ అప్పుడే చెప్పాడు. విజయ్ చెప్పినట్టే విష్ణు ఇప్పుడు కమెడియన్ గా చాలా బిజీగా వరుస సినిమాలు చేస్తున్నాడు. ట్యాక్సీవాలా మూవీతో ఇండస్ట్రీలోకి కమెడియన్ గా అడుగుపెట్టిన విష్ణు తర్వాత ఎన్నో సినిమాల్లో నటించాడు. మ్యాడ్ సినిమాకు బెస్ట్ కమెడియన్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా అందుకున్నాడు విష్ణు.