Responsive Header with Date and Time

గుడ్ న్యూస్.. తిరుపతి నుంచి పళనికి స్పెషల్ బస్ సర్వీస్.. తక్కువ ధరకే..

Category : ఆంధ్రప్రదేశ్ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2025-04-04 10:34:25


గుడ్ న్యూస్.. తిరుపతి నుంచి పళనికి స్పెషల్ బస్ సర్వీస్.. తక్కువ ధరకే..

తెలుగు వెబ్ మీడియా న్యూస్:- తిరుమల వెంకన్నను దర్శించుకున్న సమీపంలోని పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలని భక్తులు కోరుకుంటారు. తిరుపతి నుంచి కాణిపాకం, భైరవకొన వంటి సమీప పుణ్యక్షేత్రాలకు మాత్రమే కాదు.. అరుణాచలం, కంచి, వేలూరు వంటి అనేక పుణ్యక్షేత్రాల కూడా బస్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇప్పుడు తిరుపతి నుంచి పళని సుబ్రమణ్య స్వామిని దర్శిచుకోవాలని అనుకునే భక్తుల కోసం ప్రత్యెక బస్సు సర్వీసుని ఏపీ సర్కార్ అందుబాటులోకి తీసుకొచ్చింది.తిరుపతి-పళని ఆధ్యాత్మిక క్షేత్రాల మధ్య ఆంధ్రప్రదేశ్ నుంచి నూతన ఆర్టీసీ బస్సు సర్వీసును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం ప్రారంభించారు. మంగళగిరి క్యాంపు కార్యాలయంలో వేద పండితులు శాస్ర్తోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో కలిసి నూతన బస్సు సర్వీసును జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం బస్సులో కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “ఈ ఏడాది ఫిబ్రవరిలో తమిళనాడులో షష్ట షణ్ముఖ యాత్ర చేపట్టాను. యాత్రలో భాగంగా పళని కొండపై వెలసిన సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్నాను. ఈ సందర్భంగా అక్కడి భక్తులు పళని నుంచి తిరుపతికి వెళ్లాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొవలసి వస్తోందని, రెండు, మూడు బస్సులు మారాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు తమిళనాడు స్టేట్ కందన్ ఛారిటబుల్ ట్రస్ట్, పళని టౌన్ సిటిజన్ ఫోరమ్ సభ్యులు బాలాజీ, సుబ్రహ్మణ్యం వినతి పత్రం అందించారు. వెంటనే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లగా… ఆ మురగన్ ఆశీస్సులతో అరగంటలోనే అనుమతి లభించింది.505 కిలోమీటర్లు… 680 రూపాయలుకలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులతో తిరుపతి- పళని మధ్య రెండు లగ్జరీ బస్సులతో సర్వీసులు ప్రారంభించామని చెప్పారు. తిరుపతి నుంచి పళనికి, పళని నుంచి తిరుపతికి ఒకే సమయంలో ఈ రెండు బస్సులు మొదలవుతాయి. 505 కిలోమీటర్ల ఈ ప్రయాణం దాదాపు 11 గంటలపాటు సాగుతుంది. తిరుపతి నుంచి రాత్రి 8 గంటల సమయంలో మొదలైన బస్సు చిత్తూరు, క్రిష్ణగిరి, ధర్మపురి మీదుగా ఉదయం 7 గంటల సమయంలో పళని చేరుకుంటుంది. అలాగే పళని నుంచి రాత్రి 8 గంటల సమయంలో మొదలైన బస్సు తిరుపతికి ఉదయం 7 గంటల సమయంలో చేరుకుంటుంది. భద్రతతో కూడిన ప్రయాణం ఇవ్వాలని ఈ సర్వీసులను ప్రారంభించాం. పెద్దలకు రూ.680, చిన్నపిల్లలకు రూ. 380గా టికెట్ ధరలు నిర్ణయించారు. ఇది కలియుగ దైవం వెంకన్న భక్తులకు, అలాగే మురగన్ ఆరాధించే భక్తులకు అనుసంధానంగా నిలుస్తుందఅని అన్నారు.


Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Search
Categories
తాజా వార్తలు
Leave a Comment: