Category : జీవనశైలి | Sub Category : జీవనశైలి Posted on 2025-04-04 10:30:28
తెలుగు వెబ్ మీడియా న్యూస్: ఈ పెరిగిన చక్కెర స్థాయి శరీరానికి అనేక విధాలుగా హాని కలిగించడం ప్రారంభిస్తుంది. ఈ కారణంగానే డయాబెటిక్ రోగులు తమ ఆహారంపై ఎక్కువ శ్రద్ధ వహించాలని, ముఖ్యంగా చక్కెరను పూర్తిగా నివారించాలని సూచిస్తుంటారు. అయితే, డయాబెటిక్ రోగులు అరటిపండు తినవచ్చా అనే సందేహం చాలా మందిలో తలెత్తుతుంది? మీరు కూడా డయాబెటిక్ బాధితులు అయితే, ఈ విషయాలు తప్పక తెలుసుకోండి. డయాబెటిస్.. ప్రస్తుతం చిన్నా, పెద్ద తేడాలేకుండా చాలా మందిని ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్య. దీనిని సకాలంలో గుర్తించి తగిన నివారణ చేపట్టాలి. లేదంటే, ఆ వ్యక్తికి తీవ్రమైన హాని కలిగించవచ్చు. శరీరంలో ఇన్సులిన్ సరిగా పనిచేయకపోవడం వల్ల డయాబెటిస్ వస్తుంది. ఇన్సులిన్ అనేది క్లోమంలో ఉత్పత్తి అయ్యే హార్మోన్. శరీరంలో చక్కెర పరిమాణాన్ని నియంత్రించడం దీని పని. నిజానికి, మనం ఏం తిన్నా, తాగినా మన శరీరం దానిని కార్బోహైడ్రేట్‌లుగా విచ్ఛిన్నం చేసి చక్కెరగా మారుస్తుంది. దీని తరువాత, ఇన్సులిన్ హార్మోన్ శరీర కణాల నుండి చక్కెరను గ్రహించి శక్తిగా మారుస్తుంది. అయితే, డయాబెటిస్ వచ్చినప్పుడు శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గుతుంది. ఇన్సులిన్ సరిగ్గా పనిచేయదు. ఈ స్థితిలో రక్తంలో చక్కెర పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ పెరిగిన చక్కెర స్థాయి శరీరానికి అనేక విధాలుగా హాని కలిగించడం ప్రారంభిస్తుంది. ఈ కారణంగానే డయాబెటిక్ రోగులు తమ ఆహారంపై ఎక్కువ శ్రద్ధ వహించాలని, ముఖ్యంగా చక్కెరను పూర్తిగా నివారించాలని సూచిస్తుంటారు. అయితే, డయాబెటిక్ రోగులు అరటిపండు తినవచ్చా అనే సందేహం చాలా మందిలో తలెత్తుతుంది? మీరు కూడా డయాబెటిక్ బాధితులు అయితే, ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.
ఉదయాన్నే అరటి పండ్లను తినడం వల్ల శరీరానికి లెక్కలేనని ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అరటి పండ్లలో శరీరానికి కావలసిన వివిధ రకాల పోషకాలతో పాటు ఖనిజాలు కూడా ఎక్కువగా లభిస్తాయి. ఇవి పిల్లల నుంచి పెద్దల వరకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అరటిపండ్లలో విటమిన్ b6తో పాటు విటమిన్ సి, ఐరన్ మాంగనీస్ క్యాల్షియం ఎక్కువ మోతాదులో లభిస్తాయి.
ప్రతిరోజు ఉదయం అరటిపండు తినడం వల్ల శరీరంలో ఎముకల సమస్యల నుంచి కండరాల సమస్యల వరకు ఎన్నో వ్యాధులకు ఉపశమనం కలుగుతుంది. అయితే చాలామందికి అరటి పండ్లపై ఉన్న సందేహం ఏంటంటే?? మధుమేహం ఉన్నవారు వీటిని తినొచ్చా అని.. నిజానికి అరటి పండ్లలో ఎన్నో రకాల పోషకాలు లభిస్తాయి.. అంతేకాకుండా కొన్ని అరటిపండు తీపి కూడా ఎక్కువ కలిగి ఉంటాయి. అరటి పండ్లు అధిక తీపిని కలిగి ఉంటాయని మధుమేహం ఉన్నవారు వీటికి దూరంగా ఉంటారు. కానీ, మధుమేహం ఉన్నవారు కూడా అరటి పండ్లను రోజు ఉదయం పూట తినొచ్చని కొంతమంది ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే సహజ చక్కెర శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు పరిమితంగా మాత్రమే అరటి పనులను తినడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.