Category : ఆంధ్రప్రదేశ్ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2025-04-04 10:28:44
తెలుగు వెబ్ మీడియాన్యూస్:- వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి కి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. వైసీపీ హయాంలో జరిగిన మద్యం విక్రయాలు, తయారీలో అవకతవకల్లో మిథున్‌రెడ్డి ప్రమేయం ఉందంటూ సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన పిటిషన్ దాఖలు చేయగా, తాజాగా హైకోర్టు కొట్టివేసింది.