Category : సినిమా | Sub Category : సినిమా Posted on 2025-04-04 10:26:37
తెలుగు వెబ్ మీడియా న్యూస్: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ తనయుడు ఆద్విక్ సైతం ఇప్పుడు తన తండ్రిలాగే కార్ రేస్ శిక్షణలో పాల్గొంటున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతుంది. MIKA గో కార్ట్ సర్క్యూట్‌లో జరిగిన కార్ రేస్‌కు గురించి అజిత్ మేనేజర్ సురేష్ చంద్ర ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.
అజిత్ కుమార్.. దక్షిణాది సినీరంగంలో చాలా ప్రత్యేకం. ఎలాంటి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ లేని ఓ సాధారణ అబ్బాయి తమిళ చిత్రపరిశ్రమలో అగ్ర హీరోగా ఎదిగాడు. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ఇటు తమిళంతోపాటు తెలుగులోనూ మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఇటీవలే విదాముయార్చి సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చి మరోసారి సక్సెస్ అయ్యారు అజిత్. నటుడిగానే కాకుండా బైక్ కార్ రేసర్ ఫోటోగ్రాఫర్ షూటర్ కూడా. నటనపై ఆసక్తి.. ఇతర రంగాలపై తనకున్న ఇష్టాన్ని సైతం ఇప్పుడిప్పుడే నిజం చేసుకుంటున్నారు. చెన్నైలోని ఐఐటీ ( ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ) విద్యార్థుల ఉమ్మడి ప్రాజెక్ట్ అయిన తక్ష డ్రోన్ ప్రాజెక్టుకు ఆయన సలహాదారుగా కూడా వ్యవహరించడం గమనార్హం. ఇటీవల తన అజిత్ కుమార్ రేసింగ్ జట్టు తరపున జనవరి 2025లో దుబాయ్‌లో జరిగిన కార్ రేస్‌లో పాల్గొన్నాడు. తన జట్టు 911 GT3 R విభాగంలో 3వ స్థానంలో నిలిచింది. దీంతో అజిత్ కుమార్ టీంపై ప్రశంసలు కురిపించారు సినీతారలు.
ఇక ఇటీవలే నటుడిగా పద్మ భూషణ్ అవార్డ్ అందుకున్నారు అజిత్. ప్రస్తుతం ఆయన అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో అజిత్ సరసన త్రిష కథానాయికగా నటిస్తుండగా.. జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. అజిత్ ఇప్పుుడు తన కొడుకుకు ఆద్విక్ కు కార్ రేసింగ్ లో మెలకువలు నేర్పిస్తున్నాడు. ఆద్విక్ ఇటీవల పాఠశాలలో జరిగిన రన్నింగ్ రేస్ లో గోల్డ్ మెడల్ సాధించిన సంగతి తెలిసిందే. అలాగే ఇటీవల బ్రెజిల్ లెజెండ్స్ జట్టు ఇండియా ఆల్ స్టార్స్ జట్టు మధ్య జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్‌లోనూ ఆద్విక్ సత్తా చాటాడు. బ్రెజిలియన్ ఫుట్‌బాల్ లెజెండ్ రొనాల్డిన్హో అథ్విక్‌కు స్ఫూర్తినిచ్చాడు.
ఆద్విక్ తన తండ్రిలాగే కార్ రేస్ శిక్షణలో పాల్గొన్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. MIKA గో కార్ట్ సర్క్యూట్‌లో జరిగిన కార్ రేస్ వీడియోనూ అజిత్ మేనేజర్ సురేష్ చంద్ర షేర్ చేశారు. అందులోఅజిత్ తన కొడుకుకు కార్ రేసింగ్ గురించి చిట్కాలు ఇస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుండగా.. ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఆద్విక్ తండ్రికి తగ్గ తనయుడు అని.. ఈ వీడియో ఎంతో చూడముచ్చటగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.