Category : క్రీడలు | Sub Category : అంతర్జాతీయ Posted on 2025-04-04 10:24:00
తెలుగు వెబ్ మీడియా న్యూస్: బ్రెజిల్ వేదికగా జరుగుతున్న వరల్డ్ బాక్సింగ్ కప్‌లో భారత బాక్సర్లు మనీశ్ రాథోడ్, హితేశ్, అభినాశ్ జమ్వాల్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన వేర్వేరు బరువు విభాగాల్లో ప్రత్యర్థులను చిత్తుచేస్తూ ముందంజ వేశారు.
పురుషుల 65కిలోల కేటగిరీలో అభినాశ్ డెనిస్ బ్రిల్ (జర్మనీ)పై అలవోక విజయాన్ని సొంతం చేసుకోగా, 70కిలోల విభాగంలో హితేశ్ గాబ్రియెల్ రొటానీ(ఇటలీ)పై గెలిచాడు. పురుషుల 55 కిలోల విభాగంలో మనీశ్ యూసుఫ్ చోతియా(ఆస్ట్రేలియా)పై అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నాడు. సెమీస్‌లో నూర్‌సుల్లాన్ అట్లిన్‌బెక్(కజకిస్థాన్)తో మనీశ్ తలపడుతాడు.