Category : నేర | Sub Category : జాతీయ Posted on 2025-04-04 10:23:08
తెలుగు వెబ్ మీడియా న్యూస్: - ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. అక్కడ వివాహ వార్షికోత్సవ వేడుక అకస్మాత్తుగా శోకసంద్రంగా మారింది. వసీం – ఫరా అనే జంట 25వ వివాహ వార్షికోత్సవం నగరంలోని ప్రతిష్టాత్మక హోటల్ అయిన ఫహమ్ లాన్‌లో జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక దినోత్సవాన్ని కుటుంబసభ్యులు, స్నేహితులతో జరుపుకోవడానికి ఒక గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీజే పాటలకు అనుగుణంగా అతిథులు డాన్స్ చేస్తున్నారు. ఇంతలో వసీం, ఫరా కూడా వేదికపై తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ సంతోష క్షణం అకస్మాత్తుగా దుఃఖంగా మారుతుందని ఎవరూ ఊహించలేకపోయారు.
వసీం తన భార్య ఫరాతో కలిసి వేదికపై డాన్స్ చేస్తూ, పాటకు తగ్గట్టుగా ఊగిపోతున్నాడు. అప్పుడు అకస్మాత్తుగా, వసీం హఠాత్తుగా వేదికపై కుప్పకూలిపోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అతను అకస్మాత్తుగా కిందపడిపోయాడు. కొన్ని సెకన్లలోనే అతని పరిస్థితి విషమంగా మారింది. కుటుంబ సభ్యులు, హోటల్ సిబ్బంది అతన్ని హుటాహుటీన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కానీ వైద్యులు అతను అప్పటికే చనిపోయినట్లు ప్రకటించారు.