Category : తెలంగాణ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2025-04-03 10:28:25
తెలుగు వెబ్ మీడియా న్యూస్:భారాస రజతోత్సవ బహిరంగ సభ ఏర్పాటుకు హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి శివారులో బుధవారం భూమిపూజ చేశారు. మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, కెప్టెన్ లక్ష్మీకాంతరావు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్డ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు సతీష్కుమార్, పెద్ది సుదర్శన్రెడ్డి, నన్నపునేని నరేందర్, చల్లా ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఈ నెల 27న రజతోత్సవ బహిరంగ సభను సుమారు 1,500 ఎకరాల్లో నిర్వహిస్తామన్నారు. ఎల్కతుర్తి వద్ద మూడు జాతీయ రహదారుల కూడలి ఉండటం వల్ల సభాస్థలిగా ఎంపిక చేసినట్లు చెప్పారు.