Category : తెలంగాణ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2025-04-03 10:25:14
తెలుగు వెబ్ మీడియా న్యూస్:బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై అసెంబ్లీలో చేసిన బిల్లు అమలు నుంచి తప్పించుకోవడానికే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బీసీ సంఘాల ముసుగులో దిల్లీ జంతర్మాంతర్లో ధర్నాకు దిగారని కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి ధ్వజమెత్తారు. బీసీలకు రిజర్వేషన్లు పెంచడంలో రేవంత్రెడ్డికి చిత్తశుద్ది లేదని.. తాము ముందు నుంచీ చెప్తున్నది ఇప్పుడు మరోసారి నిరూపితమైందన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. \"బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతామని రేవంత్రెడ్డి హామీ ఇచ్చి ఇప్పుడు ఆ బాధ్యతను కేంద్రంపై ఎలా నెడతారు? రిజర్వేషన్ల పెంపు మీ పరిధిలో లేకపోతే ఆ హామీ ఎలా ఇచ్చారు? రేవంత్రెడ్డి అసలైన బీసీ ద్రోహి. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీయే ఇప్పుడు రేవంత్ వెనకుండి ఈ డ్రామాలు ఆడిస్తున్నారు. ఒక బీసీ వ్యక్తి ప్రధాని అయితే జీర్ణించుకోలేక మోదీని రాహుల్ గాంధీ తూలనాడిన విషయాన్ని బీసీలు ఇంకా మరచిపోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వేలో బీసీల జనాభా 46% అని చెప్తున్నారు. కానీ మంత్రివర్గంలో 46 శాతం బీసీలు ఉన్నారా? సగానికి పైగా ఉన్న బీసీలకు మీరిచ్చిన మంత్రి పదవులు రెండంటే రెండే. దీనిని బట్టే తెలుస్తుంది బీసీల మీద వారికి ఎంత ప్రేమ ఉందో. ప్రత్యేక ఎంబీసీ మంత్రిత్వశాఖ అన్నారు, ఏమైంది? మోదీ ప్రభుత్వం బీసీల సంక్షేమం, అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తోంది” అని కిషన్రెడ్డి తెలిపారు.