Category : సినిమా | Sub Category : సినిమా Posted on 2025-04-03 10:25:05
తెలుగు వెబ్ మీడియా న్యూస్:-తెలంగాణలో ప్రస్తుతం కొనసాగుతున్న సున్నిత అంశం హెచ్‌సీయూ వివాదం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్ కు ఆనుకున్న ఉన్న 400 ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వం ఐటీ హబ్ కోసం నిర్మూలించడం ఎవరికీ ఇష్టం లేదు. ఆ భూమి యూనివర్సిటీకి సంబంధించినదని స్టూడెంట్స్ ఓ వైపు ఆందోళనలు చేస్తుంటే, ఆ 400 ఎకరాలు ప్రభుత్వం పరిధిలో ఉందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తోంది.అటవీ నిర్మూలన చేయొద్దని ఎంతోమంది రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్న టైమ్ లో సినీ నటి సమంత కూడా ఈ విషయంపై గొంతు విప్పింది. ఓ వైపు నిరసనలు జరుగుతున్నప్పటికీ 400 బుల్డోజర్లను రంగంలోకి దింపి ఆ ప్రాంతంలోని చెట్లను నరికేయడానికి చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసిన సమంత, చెట్లను నరికేయడం ద్వారా మరో 4 డిగ్రీలు ఉష్ణోగత్ర పెరిగే ఛాన్సుందని హెచ్చరిస్తోంది.ఎన్నోరకాల అడవి జంతువులకు, పక్షులకు నిలయమైన అడవిని రక్షించాలని సమంత తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్ర ప్రభుత్వ తీరుకి వ్యతిరేకంగా మాట్లాడిన సమంత ధైర్యానికి అందరూ మెచ్చుకుంటున్నారు. ఆల్రెడీ ఈ విషయంపై నాగ్ అశ్విన్, తరుణ్ భాస్కర్, ప్రకాష్ రాజ్, రేణూ దేశాయ్, ఈషారెబ్బా స్పందించగా ఇప్పుడు స్టార్ హీరోయిన్ సమంత కూడా స్పందించింది. ఇప్పుడు సమంతను చూసి మరింత మంది స్టార్ సెలబ్రిటీలు కూడా స్పందిస్తారేమో చూడాలి.