Category : ఆంధ్రప్రదేశ్ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2025-04-03 10:23:01
తెలుగు వెబ్ మీడియా న్యూస్:-అక్రమ మైనింగ్ కేసులో విచారణకు హాజరు కావాలంటూ వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి కి నెల్లూరు జిల్లా పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనీలోని కాకాణి నివాసానికి వెళ్లిన కావలి డీఎస్పీ నేతృత్వంలోని పోలీసుల బృందం ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించారు. కాకాణి ఇంట్లో లేరని చెప్పడంతో ఆయన బంధువులకు నోటీసులు ఇచ్చారు. అక్రమ మైనింగ్ కేసులో ఏప్రిల్ 3న నెల్లూరు రూరల్ డీఎస్పీ ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే రెండు సార్లు కాకాణికి నోటీసులు అందజేసినప్పటికి ఆయన విచారణకు హాజరుకాకపోవడంతో మరోసారి నోటీసులు ఇచ్చారు.