Category : ఆంధ్రప్రదేశ్ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2025-04-03 10:19:01
తెలుగు వెబ్ మీడియా న్యూస్:- గత మార్చి నెలలో జరిగిన శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థిగా పోటీకి దిగిన నాగబాబు ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సూచనలకు అనుగుణంగా నాగబాబు శాసనమండలిలో ప్రమాణం చేసి బాధ్యతలు..
ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎన్నికైన జనసేన నేత కొణిదల నాగబాబు, బీజేపీ నేత సోము వీర్రాజు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఇద్దరు నేతలతో మండలి ఛైర్మన్ మోషేన్ రాజు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయించారు. జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు శాసనమండలి సభ్యునిగా బుధవారం మండలి ఛైర్మన్ మోషేన్ రాజు సమక్షంలో ప్రమాణం చేసి బాధ్యతలు చేశారు. గత మార్చి నెలలో జరిగిన శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థిగా పోటీకి దిగిన నాగబాబు ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సూచనలకు అనుగుణంగా నాగబాబు శాసనమండలిలో ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టారు. శాసనమండలి ఛైర్మన్ కార్యాలయంలో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నాగబాబు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును సచివాలయంలో మర్యాదపూర్వకరంగా కలిశారు.
నాగబాబు ఆస్తుల వివరాలు:
ఇదిలా ఉండగా, నాగబాబు ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేసిన సమయంలో ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో తన ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించారు. చరాస్తుల విలువ సుమారు రూ.59 కోట్లు ఉంగా, నాగబాబు దగ్గర బాండ్లు, మ్యూచువల్ ఫండ్స్, నగదు కలిపి రూ.59 కోట్ల ఆస్తులు ఉన్నాయి. అలాగే మ్యూచువల్ ఫండ్స్/బాండ్లు రూ.55.37 కోట్లు, చేతిలో నగదు రూ.21.81 లక్షలు, బ్యాంకు నిల్వలు రూ.23.53 లక్షలు, ఇతరులకు ఇచ్చిన అప్పులు రూ.1.03 కోట్లు ఉన్నాయి. బెంజ్ కారు విలువ రూ.67.28 లక్షలు, హ్యుందాయ్ కారు రూ.11.04 లక్షలు,
బంగారం, వెండి విలువ:
బంగారం, వెండి రూ.57.99 లక్షల విలువైన 724 గ్రాముల బంగారం, భార్య వద్ద 55 క్యారట్ల వజ్రాలు (రూ.16.50 లక్షలు), 20 కేజీల వెండి (రూ.21.40 లక్షలు), హైదరాబాద్ పరిసరాల్లో 11 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. అలాగే హైదరాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో భూములున్నాయి. రంగారెడ్డి జిల్లాలో 2.39 ఎకరాల భూమి రూ.రూ.5.3 కోట్లు, మెదక్ జిల్లా నర్సాపూర్‌లో 8.28 ఎకరాల భూమి రూ.82.80 లక్షలు, రంగారెడ్డి జిల్లా టేకులాపల్లిలో 1.07 ఎకరాల భూమి రూ.53.50 లక్షలు, హైదరాబాద్ మణికొండలో విల్లా రూ.2.88 కోట్లు, మొత్తం స్థిరాస్తుల విలువ రూ.11.20 కోట్లు
అఫిడవిట్‌లోని ఆసక్తికర అంశాల్లో ఒకటి అన్న చిరంజీవి, తమ్ముడు పవన్ కల్యాణ్ దగ్గర అప్పులు తీసుకున్న విషయం. చిరంజీవి దగ్గర రూ.28.48 లక్షలు అప్పు, పవన్ కల్యాణ్ దగ్గర రూ.6.90 లక్షలు అప్పు తీసుకున్నట్లు నాగబాబు అఫిడవిట్ సమయంలో ప్రకటించారు. ఇదే కాకుండా, బ్యాంక్ హౌసింగ్ లోన్ రూ.56.97 లక్షలు, కారు రుణం రూ.7.54 లక్షలు ఉన్నట్లు ప్రకటించారు