Category : ఆంధ్రప్రదేశ్ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2025-04-03 10:17:03
తెలుగు వెబ్ మీడియా న్యూస్:- పార్టీ నేతలతో సమావేశంలో మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజులు తమవే అని ధీమా వ్యక్తం చేశారు. కళ్లు మూసుకుంటే ముూడేళ్లు గడిచిపోతాయి. ఆ తర్వాత అఖండ మెజార్టీతో వైసీపీ గెలుస్తుందన్నారు. జగన్ 1.0కు భిన్నంగా 2.0 ఉంటుందన్నారు. కార్యకర్తల కోసం ఈసారి గట్టిగా నిలబడతానన్నారు.
మూడేళ్ల తర్వాత ఏపీలో వచ్చేది మేమే.. రాష్ట్రాన్ని పాలించేది మేమే అంటున్నారు మాజీ సీఎం జగన్. టూ పాయింట్ ఓ పాలనలో మరో జగన్‌ను చూస్తారన్నారు. చంద్రబాబులో ఏ మార్పూ రాలేదన్నారాయన. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధులతో జగన్ భేటీ అయ్యారు. ఉప ఎన్నికల్లో ధైర్యంగా పోరాడి పార్టీని గెలిపించినందుకు వారిని అభినందించారు. కష్టకాలంలో కార్యకర్తలు చూపించిన నిబద్ధతకు పార్టీ రుణపడి ఉంటుందన్నారు మాజీ సీఎం జగన్. రాబోయే రోజులు తమవే అని ధీమా వ్యక్తం చేశారు.
కళ్లు మూసుకుంటే ముూడేళ్లు గడిచిపోతాయి. ఆ తర్వాత అఖండ మెజార్టీతో వైసీపీ గెలుస్తుందన్నారు. జగన్ 1.0కు భిన్నంగా 2.0 ఉంటుందన్నారు. కార్యకర్తల కోసం ఈసారి గట్టిగా నిలబడతానంటున్నారు మాజీ సీఎం జగన్. చంద్రబాబు మోసాలు క్లైమాక్స్‌కు చేరాయన్నారు మాజీ సీఎం జగన్. కూటమి ప్రభుత్వం తలపెట్టిన P4 విధానంపైనా విమర్శలు చేశారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ ఎగ్గొట్టేందుకే అప్పులపై అబద్ధాలు చెప్తున్నారంటూ జగన్ విమర్శించారు.
చంద్రబాబు పాలనలో అబద్ధాలు, మోసాలే కనిపిస్తున్నాయన్నారు. సంఖ్యాబలం లేకపోయినప్పటికీ స్థానిక సంస్థల ఉపఎన్నికల్లో పోటీ చేసి.. తమ పార్టీ నాయకులను ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారని జగన్ ఆరోపించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ఎన్నికల్లో గెలవాలని చూశారంటూ కూటమి నేతలపై విమర్శలు చేశారు.