Responsive Header with Date and Time

ఏపీకి గుడ్ న్యూస్..అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధులు వచ్చేశాయోచ్

Category : ఆంధ్రప్రదేశ్ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2025-04-03 10:16:05


ఏపీకి గుడ్ న్యూస్..అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధులు వచ్చేశాయోచ్

తెలుగు వెబ్ మీడియా న్యూస్ :- ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారంలో ప్రపంచ బ్యాంకు శుభవార్త అందించింది. రాజధాని అమరావతి నిర్మాణాల కోసం ఇదివరకే ప్రపంచ బ్యాంకు రూ.6,700 కోట్లు మంజూరు చేయగా, ఇందులో మొదటి విడత రుణంగా రూ.3,535 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులు ఈ రోజు (గురువారం) రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో జమ కానున్నాయి. దీనితో అమరావతి నిర్మాణంలో ఒక ముఖ్యమైన ముందడుగు పడినట్టయింది.


ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో రాజధాని నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ప్రారంభించింది. ఇప్పుడు ప్రపంచ బ్యాంకు నిధులు విడుదల చేయడంతో త్వరలోనే ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) నుంచి కూడా మొదటి విడత రుణం విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏడీబీ రూ.6,700 కోట్ల రుణం మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ రెండు బ్యాంకుల నుండి రూ.13,600 కోట్లు రుణం రూపంలో అందుతుండగా, అదనంగా రూ.1,400 కోట్లు కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక సహాయంగా అందిస్తోంది. మరోవైపు హడ్కో నుండి రూ.11 కోట్ల రుణ సమీకరణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. దీనికి సంబంధించిన అనుమతి లేఖ కూడా రాష్ట్రానికి అందింది. అంతేకాకుండా, జర్మనీకి చెందిన ఆర్థిక సంస్థ నుంచి మరొక రూ.5 వేల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.


నిజానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ రుణాలు గత డిసెంబర్ నెలలోనే ఆమోదం పొందాయి. ఆ క్రమంలో ఈ సంవత్సరం జనవరిలోనే బ్యాంకుల నుంచి మొదటి విడత నిధులు రావాల్సి ఉంది. అయితే అమరావతి రాజధానిగా పనికిరాదని, రుణం ఇవ్వవద్దంటూ కొందరు ఆ బ్యాంకులకు లేఖలు రాశారు. ఈ అభ్యంతరాల నేపథ్యంలో వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకునేందుకు రెండు నెలలు ఆలస్యమైంది. చివరికి మొదటి విడత నిధులు విడుదల కావడంతో అమరావతి రాజధాని పనులు వేగవంతం అయ్యేందుకు మార్గం సుగమం అయింది.

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Search
Categories
తాజా వార్తలు
Leave a Comment: