Category : అంతర్జాతీయ | Sub Category : వార్తలు Posted on 2025-04-02 10:47:39
తెలుగు వెబ్ మీడియా న్యూస్: ఒక రెస్టారెంట్‌కి వెళ్లి భోజనం చేశాక లక్షల రూపాయల బిల్లు మీ చేతిలో పెడితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఒక్కసారి షాక్ అవడం ఖాయం. కానీ ఇలాంటి బిల్లులు ఆ రెస్టారెంట్‌లో ఎవ్రీ డే రోటీన్. ఆ రెస్టారెంట్‌లో లీటరున్నర నీళ్ల బాటిల్ కొనాలంటే అక్షరాల 50 వేల రూపాయలు పెట్టాల్సిందే. తవా రోటీ ధర 30 వేల రూపాయలు, టీ ధర 65 వేల రూపాయలు. ఆ రెస్టారెంట్‌కు కొత్తవారు ఎవరైనా వెళితే తొలుత గుడ్లు తేలేయడం ఖాయం. అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంది. ఈ బిల్లు భారతీయ రెస్టారెంట్‌కు చెందినది కాదు. వియత్నాంలోని ఒక భారతీయ రెస్టారెంట్‌కు చెందినది. ధరలు భారతీయ రూపాయలలో కాకుండా వియత్నామీస్ కరెన్సీ ‘డాంగ్’లో చెల్లించాల్సి ఉంటుంది.
ఒక వియత్నామీస్ డాంగ్ 0.0033 భారతీయ రూపాయలకు సమానం. అంటే మీరు ఒక రూపాయికి 300 డాంగ్‌లను పొందుతారు. ఏదైనా వియత్నామీస్ రెస్టారెంట్‌లో బిల్లు లక్షల ధరకు ఉండటానికి ఇదే కారణం. అందువల్ల, క్రింద చూపిన ‘తడ్కా ఇండియన్ రెస్టారెంట్ 2’ బిల్లు కేవలం ఇద్దరు వ్యక్తులకు 8,72,000 డాంగ్‌ల బిల్లు వేసింది. భారత రూపాయిలలో, దీని విలువ రూ. 3000. ఈ రెస్టారెంట్ వియత్నాంలోని హనోయ్ నగరంలో ఉంది. దాల్ తడ్కా ధర 1,15,000 డాంగ్, జీరా రైస్ ప్లేట్ ధర 77,000 డాంగ్.