Category : తెలంగాణ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2025-04-01 10:40:56
తెలుగు వెబ్ మీడియా న్యూస్:ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హుజూర్నగర్ సభలో మాట్లాడినవన్నీ అబద్ధాలేనని, కేసీఆర్పై విషం కక్కనిదే కాంగ్రెస్ పార్టీకి పూట గడవడం లేదని మాజీ మంత్రి జి. జగదీశెడ్డి విమర్శించారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి 15 నెలలు అవుతున్నా ఇప్పటికీ కేసీఆర్ మాట లేకుండా అసెంబ్లీ సాగడం లేదని ఎద్దేవా చేశారు. \"కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను నమ్మి ప్రజలు మోసపోయారు. కాళేశ్వరాన్ని కేసీఆర్కు అప్పగిస్తే మూడు రోజుల్లో నీళ్లు ఇచ్చి చూపిస్తామని చెప్పినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. కాంగ్రెస్ పాలనలో పంట పొలాలు ఎండి రైతులు కష్టాలపాలవుతున్నారు. రైతులకు రుణమాఫీ, రైతుబంధు, బీమా అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. సీఎం పద్ధతి, భాషను మార్చుకొని రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. రబీ ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం ఇప్పటివరకూ సమీక్షలు నిర్వహించకపోవడం దారుణం. కాళేశ్వరం నీళ్లు రాకుండా ఎన్డీఎస్ఏ సాకుతో అడ్డుకుంటున్నారు. రైతులు మేల్కొని కాళేశ్వరం కొనసాగింపునకు మరో ఉద్యమం చేపట్టాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నీళ్లను తీసుకెళ్తుంటే తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిద్రావస్థలో ఉంది” అని జగదీశ్ రెడ్డి విమర్శించారు