Responsive Header with Date and Time

మోదీ ఉపాధి.. బాబు చేయూత: పురందేశ్వరి

Category : ఆంధ్రప్రదేశ్ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2025-04-01 10:24:35


మోదీ ఉపాధి.. బాబు చేయూత: పురందేశ్వరి

తెలుగు వెబ్ మీడియా న్యూస్:- దేశంలో కోటి మందికి ఊపాధి చూపాలని టాప్‌ 500 కంపెనీలను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. రాష్ట్రంలోని పేదలకు ధనికులు చేయూత అందించాలని సీఎం చంద్రబాబు కోరుతున్నారు. ఇది దేశంలోని యువతకు, రాష్ట్రంలోని పేదలకు వరం  అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జిల్లాల నూతన అధ్యక్షులు, ఇన్‌చార్జిలతో సంస్థాగత అంశాలు-రాజకీయ కార్యాచరణపై ఆమె చర్చించారు. ఈ సందర్భంగా అధ్యక్షురాలు మాట్లాడుతూ..   ఏడాది క్రితం వరకూ రాష్ట్రంలో విద్వేషం, విధ్యంసం మాత్రమే కనిపించేవి. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఏపీకి భవిష్యత్తు అగమ్యగోచరంగా కనిపించేది. కానీ డబులింజన్‌ సర్కార్‌ వల్ల కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి. రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోంది. రహదారులకు కొత్త రూపు వచ్చింది. మోదీ, బాబు, పవన్‌ సమన్వయంతో పోలవరం, అమరావతి నిర్మాణాలు ఊపందుకున్నాయి. ఈ విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి  అని పార్టీ నేతలకు పురందేశ్వరి దిశా నిర్దేశం చేశారు.


Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Search
Categories
తాజా వార్తలు
Leave a Comment: