Category : జీవనశైలి | Sub Category : జీవనశైలి Posted on 2025-03-31 10:14:33
తెలుగు వెబ్ మీడియా న్యూస్:బాదం పాలు ఆరోగ్యకరమైన పానీయం. ఇది బాదం గింజలను నీటిలో నానబెట్టి గ్రైండ్ చేసి వడకట్టి తయారుచేస్తారు. ఇందులో ఖనిజాలు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటంతో శరీరానికి శక్తినిస్తుంది. కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, విటమిన్-ఇ వంటి పోషకాలు ఎముకల బలాన్ని పెంచి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. బాదం పాలు రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. మధుమేహం ఉన్నవారికి ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను స్థిరంగా ఉంచేందుకు తోడ్పడుతుంది. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండటంతో రక్తంలో చక్కెర స్థాయిలను త్వరగా పెంచదు.
అధిక బరువు ఉన్నవారికి బాదం పాలు మంచి ఎంపిక. తక్కువ కేలరీలు ఉండటంతో బరువు నియంత్రణకు సహాయపడతాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు కడుపునిండిన భావన కలిగించి అధికాహారాన్ని నివారించడంలో సహాయపడతాయి. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరిచి, శరీరానికి అవసరమైన పోషకాలను గ్రహించేందుకు తోడ్పడుతుంది. బాదం పాలను ఆహారంలో భాగంగా చేర్చుకోవడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. ఇది శరీరాన్ని పోషించి, ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఉత్తమమైన పానీయం.