Category : అంతర్జాతీయ | Sub Category : వార్తలు Posted on 2024-12-21 10:00:27
TWM News:-ఉక్రెయిన్-రష్యా మధ్య జరుగుతోన్న యుద్దంలో మాస్కోకు మద్దతుగా ఉత్తర కొరియా తన బలగాలను పంపింది. ఉక్రెయిన్ సరిహద్దుల్లోని కుర్క్స్ ప్రాంతంలో కిమ్ బలగాలను మోహరించారు. ఉక్రెయిన్- రష్యా సంఘర్షణలో ఉత్తర కొరియా జోక్యం చేసుకోవడంపై అంతర్జాతీయ సమాజం తీవ్ర ఆందోళనకు గురయ్యింది. దీని వల్ల పరిస్థితి మరింత తీవ్రమవుతుందని అభిప్రాయపడింది. ఈ క్రమంలో రష్యా కోసం పోరాటం చేస్తోన్న ఉత్తర కొరియా సైనికులు రెండు రోజుల్లో 30 మంది చనిపోయినట్లు ఉక్రెయిన్ తెలిపింది.