Category : నేర | Sub Category : ఆంధ్రప్రదేశ్ Posted on 2025-01-04 11:54:40
TWM News:-విశాఖ కారాగారంలో ఖైదీలు ఉండే నర్మదా బ్లాక్లో శుక్రవారం సెల్ఫోన్ దొరకడం కలకలం రేపింది.
విశాఖపట్నం: ప్రాంగణంలో సెల్ఫోన్ ఉన్నట్లు అందిన సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించినట్లు జైలు సూపరింటెండెంట్ మహేష్బాబు తెలిపారు. నర్మదా బ్లాక్ భవనాన్ని పరిశీలించగా అక్కడ గచ్చును తవ్వి అందులో సెల్ఫోన్ ఉంచి పైన మార్బుల్ పలక అమర్చినట్లు గుర్తించామన్నారు. సెల్ఫోన్లో సిమ్ తొలగించారని పేర్కొన్నారు. ఆ బ్లాక్లోని ఓ ఖైదీపై అనుమానం ఉందని, అతను గంజాయి సరఫరా కేసులో నిందితుడని చెప్పారు.