Category : సినిమా | Sub Category : సినిమా Posted on 2025-01-04 11:44:53
తెలుగు వెబ్ మీడియా న్యూస్ : ఉప్పెన సినిమాతో మొదటి ప్రయత్నమే బ్లాక్ బస్టర్ అందుకున్నాడు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమా సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ఆ సినిమా సక్సెస్ వల్ల బుచ్చిబాబు తన రెండో సినిమాను ఏకంగా రామ్ చరణ్ తో కన్ఫర్మ్ చేసుకున్నాడు. ఉప్పెన వల్ల వచ్చిన ఫేమ్ తో వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి వరుసపెట్టి సినిమాలు చేశారు.సినిమాలైతే చేశాడు కానీ అవేవీ వైష్ణవ్ కెరీర్ కు ఉపయోగపడలేదు. ఉప్పెన తప్ప తన నుంచి ఇప్పటివరకు మరో హిట్ రాలేదు. వైష్ణవ్ నుంచి ఆఖరిగా వచ్చిన ఆదికేశవ డిజాస్టర్ అయింది. దీంతో ఇప్పుడు వైష్ణవ్ కు అర్జెంటుగా హిట్ పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తను చేస్తున్న సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద వర్కవుట్ అవడం లేదు. వైష్ణవ్ ఇప్పటికే నాలుగైదు సినిమాలు చేసినా తన ఓన్ స్టైల్ ఏంటన్నది ఇంకా అతను పట్టుకోలేకపోయాడు.కాబట్టి వైష్ణవ్ కెరీర్ లో ఇప్పుడు ఉప్పెన లాంటి సినిమా మరొకటి పడితే కానీ తను మళ్లీ ట్రాక్ లోకి రాలేడు. ఓ మోస్తరు బడ్జెట్ తో తెరకెక్కుతున్న వైష్ణవ్ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద నిరాశనే మిగులుస్తున్నాయి. అందుకే నిర్మాతలు కూడా అతనితో సినిమా అంటే వెనుకడుగేస్తున్నారు. ఎంత మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నా వైష్ణవ్ తన కాళ్లపై తను నిలదొక్కుకుంటేనే తర్వాత అయినా కెరీర్ లో ముందుకు దూసుకెళ్లగలడు.