Category : నేర | Sub Category : తెలంగాణ Posted on 2025-01-04 12:03:31
TWM News:-ఫార్ములా–ఈ రేసు వ్యవహారంలో మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేపట్టిన ఏసీబీ, ఈడీ దూకుడు పెంచింది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సమన్లు జారీ చేసింది. జనవరి 6వ తేదీన హాజరు కావాలంటూ ఏసీబీ, జనవరి 7వ తేదీన విచారణకు హాజరుకావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ ఆదేశించింది. ఈ కేసులో సహ నిందితులుగా ఉన్న ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్, హెచ్‌ఎండీఏ మాజీ సీఈ బీఎల్‌ఎన్ రెడ్డిలకు కూడా సమన్లు జారీ చేసింది.
కమ్ముకొస్తున్న ఈ-రేసు కేసు.. మాజీ మంత్రి కేటీఆర్‌ను ఎటూ కదలనివ్వకుండా చెక్ పెట్టేస్తోంది. ఒకవైపు నుంచి ఏసీబీ.. మరోవైపు నుంచి ఈడీ తరుముకొస్తున్నాయి. అరెస్టుకు అరడుగు దూరంలో నిలబడ్డారా అనే సందేహాల నడుమ మొన్న క్వాష్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు కాస్త రిలీఫ్ ఇవ్వగా… తాజాగా విచారణకు రావాలంటూ ఏసీబీ నోటీసులివ్వడం హాట్‌టాపిక్‌గా మారింది. ఆ మర్నాడే ఈడీ విచారణ ఉండనే ఉంది. దీంతో ఇప్పుడందరి చూపు ఫార్ములా ఈ-రేస్ కేసు వైపే. మరి కేటీఆర్ విచారణకు హాజరవుతారా…? ఆయన లీగల్ టీమ్ ఏమంటోంది…? అన్నది ఇప్పుడు హట్‌టాపిక్‌గా మారింది.
తెలంగాణలో ఫార్ములా ఈ-రేస్ కేసు సెన్సేషన్ క్రియేట్ చేసింది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చుట్టూ ఎంక్వైరీలు మోహరిస్తున్నాయి. ఓవైపు ఏసీబీ.. మరోవైపు ఈడీ దూకుడుమీదున్నాయి. విచారణ గడువులు దూసుకొస్తున్నాయి. ఒక్కరోజు వ్యవధిలోనే ఏసీబీ, ఈడీ విచారణకు రావాలంటూ నోటీసులివ్వడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఈ కేసులతో కేటీఆర్ ఫ్యూచర్‌పై సస్పెన్స్ కొనసాగుతుండటం చర్చనీయాంశమైంది.
తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై మొన్ననే వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వ్ చేసింది తెలంగాణ హైకోర్టు. ఇంతలోనే కేటీఆర్‌ను ఏ1గా చేర్చిన ఏసీబీ… విచారణకు రావాలంటూ లేటెస్ట్‌గా నోటీసులివ్వడం హాట్‌టాపిక్‌గా మారింది. ఈనెల ఆరో తేదీన ఉదయం 10 గంటలకు విచారణకు రావాలంటూ నోటీసుల్లో పేర్కొంది.