Category : తెలంగాణ | Sub Category : తాజా వార్తలు Posted on 2025-01-04 11:32:25
తెలుగు వెబ్ మీడియా న్యూస్ : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు నాయకత్వ సమస్యతో సతమతమవుతోంది. పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వయోభారం, ఆరోగ్య కారణాల వల్ల ప్రత్యక్ష రాజకీయాలకు దూరం కావాలనుకుంటున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో ఈ పార్టీని నెక్స్ట్ ఎవరు కొనసాగిస్తారు అన్న విషయంపై అంతర్గతంగా జోరుగా చర్చలు సాగుతున్నాయి.ఇటీవల జరిగిన కుటుంబ సమావేశంలో కేసీఆర్ తన భవిష్యత్తు ప్రణాళికలు చర్చించారు. ఈ సమావేశానికి ఆయన కుమారుడు కేటీఆర్ , కుమార్తె కవిత , ఆర్థిక మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కేసీఆర్, తాను రాజకీయాలలో ఇక ఎక్కువగా యాక్టివ్ ఉండలేనని, కానీ పార్టీకి అవసరమైన సలహాలు ఇస్తానని చెప్పారు. పార్టీని నడిపే బాధ్యతలు కేటీఆర్, కవిత, హరీష్ రావులపై ఉంచినట్లు చెబుతున్నారు. అయితే రాజకీయాలలో పొత్తు అనేది ఎంతకాలం కంటిన్యూ అవుతుందో ఎవరికి స్పష్టత లేదు. మరీ ముఖ్యంగా కుటుంబ సభ్యులలో అధికారం కోసం అంతర్గతంగా ఎటువంటి కలహాలు సాగుతాయో అందరికీ తెలుసు.
పార్టీలో స్పష్టమైన నిర్ణయం లేకపోవడంతో కేటీఆర్, కవిత మధ్య నేతృత్వం కోసం పోటీ జోరుగా సాగుతోంది అన్న టాక్ నడుస్తోంది. పార్టీ కార్యకర్తల సమావేశాల్లో కేటీఆర్ సీఎం, కవిత సీఎం నినాదాలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనలు పార్టీకి ఒకరి ఆధిపత్యానికి మరొకరు పోటీ పడుతున్నట్లు చూపుతున్నాయి. మరోవైపు, హరీష్ రావు మద్దతుదారులు ఆయన స్పందన లేకపోవడంతో నిరుత్సాహంగా ఉన్నారు. హరీష్ రావు మంచి నాయకుడిగా పేరున్నప్పటికీ, తాజా పరిస్థితుల నేపథ్యంలో కూడా ఆయన మౌనంగా ఉండడం ఆయన అనుచరులకు రుచించడం లేదు.ఇటీవలి ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్‌కు మద్దతు తగ్గింది. రాబోయే స్థానిక ఎన్నికల ముందు పార్టీలో ఈ గందరగోళం ఉంటే కేడర్ మరింత దెబ్బతినే అవకాశముందని పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కార్యాచరణ కేటీఆర్ , కవిత చుట్టూ సాగుతున్నప్పటికీ, హరీష్ రావు మద్దతుదారులు ఇంకా ఆశలు వదిలిపెట్టలేదు. నాయకత్వ మార్పు పై స్పష్టత లేకపోవడం వల్ల పార్టీ మొత్తం గందరగోళంలో పడినట్లు కనిపిస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో కీలకమైన బీఆర్ఎస్, ఈ పరిస్థితిని ఎలా పరిష్కరిస్తుందో చూడాల్సి ఉంది. ఇది పార్టీ భవిష్యత్తు మీద చాలా ప్రభావం చూపే అవకాశం ఉంది.