Category : సినిమా | Sub Category : సినిమా Posted on 2025-01-04 12:04:22
తెలుగు వెబ్ మీడియా న్యూస్ : రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన ముని, కాంచన, గంగ ఫ్రాంచైజీ సినిమాలు మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఈ ఫ్రాంచైజీలో మూడు సినిమాలున్నాయి. ఈ ఫ్రాంఛైజీలో నాల్గవ సినిమా అంతకుమించి ఉండాలని లారెన్స్ దీని కోసం ఎక్కువ టైమే తీసుకున్నాడు. కాంచన3 సినిమా వచ్చి దాదాపుగా ఏడేళ్లవుతుంది.ఈ గ్యాప్ లో రెండు మూడు సార్లు కాంచన4 గురించి వార్తలొచ్చాయి. కానీ ఇప్పటివరకు ఆ సినిమా పట్టాలెక్కలేదు. ఇదిలా ఉంటే రీసెంట్ గా రాఘవ లారెన్స్ కాంచన4ని పట్టాలెక్కించే ఏర్పాట్లు చేస్తున్నాడు. రీసెంట్ గా కాంచన4 గురించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే అని ఇప్పటికే వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు పూజా పాత్ర గురించి ఇంట్రెస్టింగ్ ప్రచారం జరుగుతుంది.ఇప్పటివరకు పూజా అందాలను మాత్రమే చూశాం. కానీ కాంచన4లో మాత్రం అమ్మడిని డీ గ్లామర్‌గా చూడడంతో పాటూ దెయ్యంగా చూడబోతున్న నేపథ్యంలో అసలు పూజాని దెయ్యంగా చూపించాలనే ఆలోచన లారెన్స్ కు ఎలా వచ్చిందని కొందరంటుంటే, ఈ అవకాశం బుట్టబొమ్మకు చాలా హెల్ప్ కానుందని మరికొందరంటున్నారు. రాధే శ్యామ్ సినిమా తర్వాత సౌత్ లో మంచి హీరోయిన్ గా దూసుకెళ్తుందనుకున్న పూజాకు ఆ తర్వాత నుంచి డౌన్ ఫాల్ మొదలైంది. ఇప్పుడు కాంచన4లో దెయ్యం పాత్రలో మెప్పిస్తే పూజా ఆ తర్వాత మళ్లీ తన జోరు కంటిన్యూ చేసే అవకాశాలున్నాయి.