Category : సినిమా | Sub Category : సినిమా Posted on 2025-01-04 12:09:39
తెలుగు వెబ్ మీడియా న్యూస్ : టాలీవుడ్ లో పాన్ ఇండియా సినిమాలకు ఇప్పుడు యాంటీ ఫ్యాన్స్ దెబ్బ గట్టిగానే తగులుతోంది. దేవర సినిమా టైంలో యాంటీ ఫ్యాన్స్ చేసిన సందడి అంత ఇంత కాదు. ఆ సినిమా వసూళ్ల తగ్గడానికి కూడా వాళ్లే కారణం అనేది చాలామందికి క్లారిటీ ఉంది. మౌత్ పబ్లిసిటీ లేకపోతే దేవర సినిమా ఖచ్చితంగా భారీ డిజాస్టర్ అయ్యేది. ఇక మౌత్ పబ్లిసిటీ తో పుష్ప సినిమా కూడా కాస్త వసూళ్లపరంగా దూసుకుపోయింది. సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ అలాగే ప్రభాస్ ఫ్యాన్స్ ఆ సినిమాను గట్టిగా టార్గెట్ చేశారు.అయినా సరే నార్త్ ఇండియాలో ఎక్కువగా డామినేట్ చేసింది పుష్ప 2. ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా గేమ్ చేంజర్ సినిమా రెడీ అవుతోంది. సంక్రాంతి కానుక సినిమాను రిలీజ్ చేయడానికి నిర్మాత దిల్ రాజు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ఈ సినిమా విషయంలో యాంటీ ఫ్యాన్స్ హడావుడి ఎక్కువగా ఉంటుందని అంచనా వేసారు. అయితే ముందు మేకర్స్ భయపడినా అంత ప్రభావం ఏమి కనపడటం లేదు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమాను పెద్దగా సీరియస్ గా తీసుకోలేదని చెప్పాలి.
అలాగే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. తెలంగాణలో పోలీసులు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ను అరెస్టు చేసిన తర్వాత సోషల్ మీడియాలో కాస్త సైలెంట్ అయినట్లే కనపడింది వాతావరణం. అయితే సినిమా రిలీజ్ టైం కి కచ్చితంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి ముప్పు ఉండవచ్చు అనే ఆందోళన గేమ్ చేంజర్ యూనిట్ లో కనపడుతోంది. దీనితో ప్రమోషనల్ ఈవెంట్స్ ను గట్టిగా ప్లాన్ చేస్తున్నారు నిర్మాత దిల్ రాజు. ట్రైలర్ విషయంలో పెద్దగా ఫోకస్ చేయకపోయినా సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రం ఖచ్చితంగా టార్గెట్ చేసే ఛాన్స్ ఉండవచ్చు అనే భయం వెంటాడుతుంది. ఇప్పటికే నందమూరి ఫ్యాన్స్ సపోర్ట్ కోసం రామ్ చరణ్ అన్ స్టాపబుల్ షో కి కూడా అటెండ్ అయ్యాడు. ఒకవేళ ఎన్టీఆర్ ఫ్యాన్స్ టార్గెట్ చేసినా… ఆ షో చూసిన తర్వాత కచ్చితంగా బాలకృష్ణ ఫ్యాన్స్ సినిమా చూస్తారు అనే ధీమాలో రాంచరణ్ ఉన్నాడని అంటున్నారు.