Category : సినిమా | Sub Category : సినిమా Posted on 2025-01-04 11:58:47
తెలుగు వెబ్ మీడియా న్యూస్ : యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా దిల్ రూబా. ఈ సినిమాలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది. దిల్ రూబా చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్స్ మరియు ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తమ నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రూబా సినిమా ఫిబ్రవరిలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ – దిల్ రూబా గురించి మాట్లాడేముందు ఫస్ట్ మా ప్రొడక్షన్ హౌస్ సారెగమా వారికి థ్యాంక్స్ చెప్పాలి. తెలుగులో వారి ఫస్ట్ మూవీలో నేను హీరో కావడం సంతోషంగా ఉంది. నన్ను, మా టీమ్ ను వారు ఎంతో బాగా చూసుకున్నారు. అలాగే సారెగమా సంస్థ ప్రొఫెషనలిజం నాకు బాగా నచ్చింది. మా ప్రొడ్యూసర్ రవి చాలాకాలంగా డిస్ట్రిబ్యూషన్ లో ఉన్నారు. నాకు రవి, సురేష్ రెడ్డి 2019లో పరిచయం. నా రాజావారు రాణిగారు సినిమా డిస్ట్రిబ్యూట్ చేస్తారా అని అడిగేందుకు వెళ్లాను. సినిమా మీద ప్యాషన్ ఉన్న వ్యక్తి రవి అన్న. ఈ కథ నచ్చి ప్రొడ్యూస్ చేసేందుకు ముందుకొచ్చారు. అప్పటి నుంచి ఇప్పటివరకు సినిమా కోసమే కష్టపడుతున్నారు.