Category : జీవనశైలి | Sub Category : జీవనశైలి Posted on 2024-12-20 11:03:55
TWM News:-శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో, రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో పండ్లు చాలా కీలకమని వైద్యులు చెబుతుంటారు. పండ్లు తినడం వల్ల చర్మం మెరుస్తుంది. మంచి ఆరోగ్యానికి అవసరమైన అనేక రకాల పోషకాలను అందిస్తాయి. అయితే, చాలా మందికి పండ్లను తినడానికి సరైన టైం ఏదో తెలియదు. కొందరు భోజనం తర్వాత పండ్లు తింటారు. మరికొందరు భోజనం తర్వాత తింటారు. నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం..
సరైన నియమాల ప్రకారం పండు తినకపోతే అది విషపూరితం అవుతుందని ఆయుర్వేదం చెబుతోంది. ఆహారం తీసుకున్న తర్వాత పండ్లు తింటే శరీరంలో విషపూరితమైన అంశాలు పేరుకుపోతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. భోజనం తర్వాత పండ్లు తినడం వల్ల ఎసిడిటీ సమస్య వస్తుంది. ముఖ్యంగా నారింజ, నిమ్మ, ద్రాక్ష వంటి పుల్లని పండ్లు కడుపులో యాసిడ్ స్థాయిని పెంచుతాయి. ఫలితంగా ఎసిడిటీ వంటి సమస్యలు ఎదురవుతాయి. పుల్లని పండ్ల రసం ఈ యాసిడ్‌ను పెంచడానికి కారణమవుతుంది.
భోజనం తర్వాత పండ్లు తినడం అంత మంచిది కాదు. దీంతో తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. పండ్లలో ఉండే ఘగర్ యాసిడ్ తలనొప్పి వంటి సమస్యలను కలిగిస్తుంది. సిట్రస్ పండ్లలో ఆక్టోపమైన్ ఉంటుంది. ఇది తలనొప్పికి కారణమవుతుంది. మైగ్రేన్ బాధితులు సిట్రస్ ఫ్రూట్స్, అవకాడోస్, రాస్ప్బెర్రీస్, ప్లమ్స్ వంటి డ్రై ఫ్రూట్స్ తినకూడదు.
ఆహారం తిన్న తర్వాత పండ్లు తింటే శరీరంలో విషపూరితమైన కారకాలు పేరుకుపోతాయి. దీని వల్ల గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, మలబద్ధకం వంటి అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే భోజనం చేసిన తర్వాత పండ్లు తింటే పండ్లలోని పీచు పోషకాలు మలంలో కలిసిపోవు.
ఆహారంతో పాటు పండ్లను తినడం వల్ల జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి. భోజనం తర్వాత పండ్లు తినడం వల్ల జీర్ణశక్తి తగ్గుతుంది. దీంతో జీర్ణవ్యవస్థపై ఒత్తిడి ఏర్పడి ఆహారం జీర్ణం కావడం కష్టమవుతుంది. పండ్లు ఆరోగ్యకరమైన ఆహారం అయినప్పటికీ, వాటిలో సహజ చక్కెరలు ఉంటాయి. పండ్లను ఎక్కువగా తినడం వల్ల బరువు పెరగడంతోపాటు ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ భోజనం తర్వాత పండ్లు తినకూడదంటున్నారు ఆరోగ్య నిపుణులు.