Category : క్రీడలు | Sub Category : జాతీయ Posted on 2024-12-20 11:03:20
TWM News:-అండర్-19 మహిళల ఆసియా కప్ టీ20 టోర్నీలో భారత్ ఫైనల్క దూసుకెళ్లింది.
కౌలాలంపూర్: అండర్-19 మహిళల ఆసియా కప్ టీ20 టోర్నీలో భారత్ ఫైనల్క దూసుకెళ్లింది. శుక్రవారం శ్రీలంకతో జరిగిన సూపర్-4 మ్యాచ్లో యువ భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లంక 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని భారత్ 14.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. తెలుగమ్మాయి గొంగడి త్రిష (32; 24 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లు), కమలిని (28; 26 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), మిథిల (17*; 12 బంతుల్లో 4 ఫోర్లు) రాణించారు. ఈశ్వరి (0), సానికా చాల్కే (4) విఫలమవడంతో భారత్ 5 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. తర్వాత త్రిష, కమిలిని నిలకడగా ఆడి ఇన్నింగ్స్ను గాడిలో పెట్టారు. తర్వాత వీరిద్దరూ స్వల్పవ్యవధిలో ఔటయ్యారు. కెప్టెన్ నిక్కీ ప్రసాద్ (3) కూడా కాసేపటికే వెనుదిరిగింది. ఈ దశలో భవికా (7) అండతో మిథిల జట్టును విజయం దిశగా నడిపించింది.
శ్రీలంక బ్యాటర్లలో కెప్టెన్ మనుడి నానయక్కర (33; 30 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్లు), సుముడు నిసంసాల (21) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. సజనా కవిండి (9), రష్మిక (8), హిరుణి హన్సిక (2), దహమి (5), లిమాన్స (1) సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ చేరారు. భారత బౌలర్లలో ఆయూషి శుక్లా (4/10) మరోసారి మెరిసింది. పరుణికా సిసోడియా 2, షబ్నమ్ షకీల్, దృతి కేసరి ఒక్కో వికెట్ పడగొట్టారు.