Category : జీవనశైలి | Sub Category : జీవనశైలి Posted on 2024-12-20 10:53:13
WM News:-ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మందికి అన్నమే ప్రధానమైన ఆహారం. ఇది వివిధ రకాలుగా తయారు చేస్తారు. అయితే, ఇటీవలి కాలంలో వైట్‌రైస్‌తో పాటు బ్రౌన్ కూడా విపరీతంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ రెండు రకాలు ఒకే ధాన్యం నుండి వచ్చినప్పటికీ వేర్వేరు ప్రాసెసింగ్ పద్ధతులలో తయారవుతాయి. దీని ఫలితంగా విభిన్న పోషక విలువలు, సంభావ్య ఆరోగ్య ప్రభావాలు ఏర్పడతాయి. వరి పై భాగం.. పొట్టును తీసివేస్తే బ్రౌన్ రైస్ తయారవుతుంది. ఇది గోధుమ రంగులో ఉంటుంది. దీనిని శుభ్రం చేసి బ్రౌన్ కలర్ పోయే వరకు పాలిష్ చేస్తే అది వైట్ రైస్. బ్రౌన్ రైస్‌లో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు వంటి శరీరానికి అవసరమైన పోషకాలు మెండుగా ఉంటాయని అంటున్నారు. అయితే, ఈ బ్రౌన్ రైస్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..
బ్రౌన్ రైస్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. బ్రౌన్ రైస్ లో ఉండే ఫైబర్ స్థాయిలు పేగు కదలికలను నియంత్రించడంలో, ప్రేగు కదలికలను సక్రమంగా ఉంచడంలో సహాయపడతాయి. మలబద్ధకం నయం చేయటంలో అద్భుతమైన ఫలితాలను కలిగిస్తుంది. బ్రౌన్ రైస్ తినడం వల్ల బరువు తగ్గించుకోవచ్చునని నిపుణులు చెబుతున్నారు. బ్రౌన్ రైస్ లో పోషకాలు, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. కావున బ్రౌన్ రైస్ తినడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది.
బ్రౌన్ రైస్‌ను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. కాబట్టి, షుగర్ ఉన్నవారు వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ తినొచ్చు. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బరువును అదుపులో ఉంచుతుంది. ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అంతేకాదు..బ్రౌన్ రైస్ లో ఉండే పౌష్టిక తత్వాలు గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఉండే ఫైబర్ గుండెకి సంబంధించిన అన్ని రకాల సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. బ్రౌన్ రైస్‌తో శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించడంలో సహాయపడుతుంది.