Category : నేర | Sub Category : తెలంగాణ Posted on 2024-12-20 10:49:49
TWM News:-జగిత్యాల ప్రత్యేక సబ్ జైలులో విచారణ ఖైదీ క్యాతం మల్లేశం(42) మృతి చెందారు.
జగిత్యాల, మల్యాల: జగిత్యాల ప్రత్యేక సబ్జె జైలులో విచారణ ఖైదీ క్యాతం మల్లేశం(42) మృతి చెందారు. బుధవారం అర్ధరాత్రి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందని చెప్పడంతో జైలు సిబ్బంది జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం రామన్నపేటకు చెందిన మల్లేశం ఓ కేసులో అరెస్టయి 13 రోజుల కిందట జైలుకు వచ్చారు. జైలు అధికారి మొగులేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ సీఐ వేణుగోపాల్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.