Category : సినిమా | Sub Category : సినిమా Posted on 2025-04-16 10:55:13
తెలుగు వెబ్ మీడియా న్యూస్:- ఓదెల రైల్వే స్టేషన్ సినిమాకు సీక్వెల్ గా వస్తోన్న సినిమా ఓదెల2 తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు అశోక్ తేజ దర్శకత్వం వహిస్తుండగా, సంపత్ నంది కథ అందిస్తూ నిర్మించారు. ఏప్రిల్ 17న సినిమా రిలీజ్ కానున్న సందర్భంగా మేకర్స్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తాజాగా హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యాంకర్ సుమ, తమన్నాను మీకు సూపర్ పవర్ వస్తే ఏం చేస్తారని అడిగింది.దానికి తమన్నా తనకు నిజంగా సూపర్ పవర్ వస్తే ఎంత కావాలంటే అంత తిని, బరువు పెరగకుండా ఉండే సూపర్ పవర్ ఉండాలనుకుంటానని, మీకు ఈ సూపర్ పవర్ వద్దా అని సుమని అడిగ్గా దానికి సుమ తనక్కూడా ఆ పవర్ కావాలని చెప్పింది. మనందరికీ ఆ సూపర్ పవర్ కావాలంటూ తమన్నా ఆ సంభాషణను అక్కడితో సరదాగా ముగించింది.తాను ఎన్నో సినిమాలు చేసినప్పటికీ ఎవరితో ఏర్పడని బాండింగ్ సంపత్ నందితో ఏర్పడిందని, ఆయనతో ఇప్పటికి నాలుగు సినిమాలు చేశానని, ఆయనకు జీవితంలో రుణపడి ఉంటానని, సినిమా తన కోసం కాకపోయినా సంపత్, మధుకోసమైనా ఆడాలని కోరింది. తమన్నా శివశక్తిగా కనిపించనున్న ఓదెల2 కోసం ఆమె ఎంతగానో కష్టపడిందని ఇప్పటికే చిత్ర యూనిట్ సభ్యులు చాలా సార్లు చెప్పారు.