Responsive Header with Date and Time

ఖర్చులకు డబ్బులు, ఫ్లైట్ టికెట్స్‌ ఇస్తాం- వెళ్లిపోండి

Category : అంతర్జాతీయ | Sub Category : వార్తలు Posted on 2025-04-16 11:00:55


ఖర్చులకు డబ్బులు, ఫ్లైట్ టికెట్స్‌ ఇస్తాం- వెళ్లిపోండి

తెలుగు వెబ్ మీడియా న్యూస్ : అమెరికాలో ఉన్న శరణార్థులకు డొనాల్ట్ ట్రంప్‌ బంపర్ ఆఫర్ ప్రకటించారు. యూఎస్ నుంచి స్వయంగా వెళ్లిపోవాయేవారికి ఖర్చుకు డబ్బులు సహా, ఫ్లైట్ టికెట్స్ ఇస్తామని తెలిపారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికా అధ్యక్షుడు ఈ విషయాన్ని వెల్లడించారు.


డొనాల్డ్‌ ట్రంప్ అధికారం చేపట్టిన దగ్గరి నుంచి వలసల విషయంలో దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు. ఈనేపథ్యంలోనే అమెరికాలో అక్రమంగా ఉంటూ, స్వీయ బహిష్కరణ  సెల్ఫ్‌-డిపార్టేషన్‌  చేసుకోవాలనుకునే వారికి ట్రంప్‌ ఒక బంపర్‌ ఆఫర్‌ను ప్రకటించారు. అలాంటి వారికి విమాన ఖర్చులతో పాటు ఖర్చుకు కొంత నగదును అందిస్తామని పేర్కొన్నారు.


అక్రమ వలసదారులను వెళ్లగొట్టడమే లక్ష్యం!

అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉంటూ, నేరాలకు పాల్పడుతున్న వారిపై ఇమిగ్రేషన్‌ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇలా చట్టవిరుద్ధంగా ఉంటున్న సాధారణ పౌరుల కోసం స్వీయ బహిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. అలా వెళ్లాలనుకునే వారికి తాము విమాన ఖర్చులతో పాటు కొంత నగదును కూడా అందిస్తామని ఆయన ప్రకటించారు. వెళ్లిపోయిన వారిలో మంచివారు ఉంటే, వారిని వెనక్కి తీసుకోవడంపై కూడా డొనాల్డ్‌ ట్రంప్‌ మాట్లాడారు. దేశం నుంచి అక్రమ వలసదారులను వెళ్లగొట్టడమే తన ప్రథమ లక్ష్యం అని ట్రంప్‌ ఈ సందర్భంగా స్పష్టంచేశారు. అంతేకాదు సముచితమని భావిస్తే, వారు చట్టపరమైన పద్ధతిలో వెనక్కి తిరిగిరావడానికి అనుమతి ఇస్తామని అన్నారు.

ట్రంప్ అమెరికా అధ్యక్షుడైనప్పటి నుంచి అక్రమ వలసదారులపై డొనాల్డ్‌ ట్రంప్‌ కఠినంగా వ్యవహరిస్తున్నారు. కఠిన నిర్ణయాలతో వారిని అమెరికా నుంచి సాగనంపే ప్రక్రియను వేగవంతం చేశారు. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్‌ చేపడుతున్నారు. ఇక, ఇటీవల యూఎస్ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ కూడా అక్రమ వలసదారులకు హెచ్చరికలు జారీ చేసింది. యూఎస్‌లో కనీసం 30 రోజులకు మించి నివసిస్తున్నవారు కచ్చితంగా ఫెడరల్‌ గవర్నమెంట్‌ వద్ద రిజిస్టర్‌ చేయించుకోవాలని తెలిపింది. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే, నేరంగా పరిగణించి అపరాధ రుసుము, జైలు శిక్షలు విధిస్తామని గట్టిగా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సొంతంగా వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నవారికి ఆర్థిక సాయం, ఫ్లైట్‌ టికెట్స్ ఇస్తామని ట్రంప్ చెప్పడం గమనార్హం.




Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Search
Categories
తాజా వార్తలు
Leave a Comment: