Category : సినిమా | Sub Category : సినిమా Posted on 2025-04-16 10:49:25
తెలుగు వెబ్ మీడియా న్యూస్:- కల్కి2898ఏడీ సినిమాతో యావత్ భారతదేశం దృష్టిని ఆకర్షించిన నాగ్ అశ్విన్ఎంత టాలెంటెడ్ అనేది అందరికీ తెలుసు. మొదటి సినిమా ఎవడే సుబ్రమణ్యం తోనే తన సత్తా చాటిన నాగి కల్కి తో తన టాలెంట్ ను దేశవ్యాప్తంగా ప్రూవ్ చేసుకున్నాడు. రీసెంట్ గా కాలేజ్ స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అయిన నాగ్ అశ్విన్ సినిమాపై తన ఆలోచనలను పంచుకున్నాడు.మనకు వచ్చిన ఆలోచనలతో వేరే వాళ్లు సినిమాలు చేస్తే ఎంత బాధగా ఉంటుందో తనకు తెలుసని, ఇండస్ట్రీలో ఈ అనుభవాన్ని ప్రతీ ఒక్కరూ ఎక్స్‌పీరియెన్స్ చేస్తారని తెలిపాడు. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో 2010లో వచ్చిన ఇన్సెప్షన్ లాంటి ఆలోచనే తనకూ వచ్చిందని, తనకు 2008లోనే ఆలోచన వచ్చిందని, కాకపోతే నోలన్ సినిమా డ్రీమ్స్ గురించి అయితే తనది ఆలోచనల గురించి అని నాగ్ అశ్విన్ తెలిపాడు.ఇన్సెప్షన్ ట్రైలర్ చూసిన తర్వాత తన ఆలోచనను అక్కడితో ఆపేశానని, ఆ విషయం తననెంతో ప్రభావితం చేసిందని, ఆ తర్వాత వారం పాటూ తాను డిప్రెషన్ లోకి వెళ్లినట్టు తెలిపాడు నాగి. ఈ విషయం తెలుసుకున్న అందరూ నాగి టాలెంట్ నెక్ట్స్ లెవెల్ అని చెప్తూ సోషల్ మీడియాలో డిస్కస్ చేస్తున్నారు. ప్రస్తుతం నాగి కల్కి2 స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. త్వరలోనే నాగి ఆలియా భట్ తో కూడా ఓ సినిమాను చేయనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజమెంతన్నది తెలియాల్సి ఉంది.