Category : క్రీడలు | Sub Category : అంతర్జాతీయ Posted on 2025-04-16 10:46:10
తెలుగు వెబ్ మీడియా న్యూస్:- ప్రపంచకప్ షూటింగ్ ఛాంపియన్షిప్ స్టేజ్-2 టోర్నమెంట్లో భారత్ ఖాతాలో తొలి పతకం చేరింది. మంగళవారం పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో సౌరభ్ చౌదరి కాంస్యంతో మెరిశాడు.
లిమా: ఫైనల్లో అతడు 219.1 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. ఈ విభాగంలో కయ్ హు (చైనా, 246.4) స్వర్ణం నెగ్గగా.. అల్మిడా (బ్రెజిల్, 241.0) రజతాన్ని సొంతం చేసుకున్నాడు. మరో భారత షూటర్ వరుణ్ తోమర్ (198.1) నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు.