Category : తెలంగాణ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2025-04-16 11:11:25
తెలుగు వెబ్ మీడియా న్యూస్:తెలంగాణలో భూములు, మద్యం విక్రయాలు, అప్పులతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌లో మీడియాతో కిషన్ రెడ్డి మాట్లాడుతూ భూముల అమ్మకంతో బీఆర్‌ఎస్ తో కాంగ్రెస్ పోటీపడుతోందన్నారు. హెచ్‌సీయూ అంశంలో తనపై కేసు పెడితే ఎదుర్కొంనేందుకు సిద్ధమని తెలిపారు. అర్థరాత్రి ఫ్లడ్ లైట్లు పెట్టి చెట్లను నరికి న ప్రభుత్వాలను చూశామా అని ప్రశ్నించారు.బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు తొందరేమీ లేదని అన్నారు. ఎన్నికకు మరో వారం రోజుల సమయం పట్టే అవకాశముందని తెలిపారు. పార్టీ జాతీయ అద్యక్షుడి ప్రతిపాదనల్లో తన పేరు లేదని స్పష్టం చేశారు. తమిళనాడు లో ఎన్డీఏను పునరుద్ధరించామని, తెలంగాణలోనూ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నామన్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్ తమ పార్టీ నేత అని, ఆయన అంశంపై అంతర్గతంగా చర్చించుకుంటామని తెలిపారు.