Category : అంతర్జాతీయ | Sub Category : వార్తలు Posted on 2025-04-16 10:28:17
తెలుగు వెబ్ మీడియా న్యూస్ : అఫ్గానిస్థాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 5.9 తీవ్రతో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ పేర్కొంది. ఈ ప్రకంపనలు భారత్‌కు తాకినట్లు తెలిపింది. అయితే ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకారం, బుధవారం తెల్లవారుజామున ఈ భూకంపం సంభవించింది. భూకంపం కేంద్రం 75 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు పేర్కొంది. హిందూ కుష్ ప్రాంతంలో బగ్లాన్ నగరానికి తూర్పున 164 కిలీమీటర్ల దూరంలో ఉన్నట్టులు తెలిపింది. ఈ భూకంపం ధాటికి అటు దిల్లీ ఎన్సీఆర్లోనూ భూప్రకంపనలు సంభవించాయి. భూకంపానికి సంబంధించి పులువురు యూజర్లు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. దిల్లీలో భూకంపాన్ని ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేశారని, దిల్లీలో మళ్లీ భూకంపం అంటూ నెటిజనట్లు పోస్టులు పెట్టారు.