Responsive Header with Date and Time

మారుతీ టీమ్‌ ప్రొడక్ట్, వానరా సెల్యులాయిడ్, జీ స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్న ‘బ్యూటీ’

Category : సినిమా | Sub Category : సినిమా Posted on 2025-04-07 10:59:11


 మారుతీ టీమ్‌ ప్రొడక్ట్, వానరా సెల్యులాయిడ్, జీ స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్న ‘బ్యూటీ’

తెలుగు వెబ్ మీడియా న్యూస్:- వానరా సెల్యూలాయిడ్, మారుతీ టీం ప్రొడక్ట్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘బ్యూటీ’ . గీతా సుబ్రమణ్యం, హలో వరల్డ్, భలే ఉన్నాడే ఫేమ్ జె.ఎస్.ఎస్. వర్ధన్ మాటలు, దర్శకత్వం వహించిన ‘బ్యూటీ’ చిత్రాన్ని అడిదాల విజయపాల్ రెడ్డి, ఉమేష్ కె ఆర్ బన్సాల్ నిర్మించారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లేని ఆర్.వి. సుబ్రహ్మణ్యం అందించారు. ఈ చిత్రంలో అంకిత్ కొయ్య, నీలఖి పాత్ర హీరో హీరోయిన్లుగా నటించారు.ఇప్పటికే ‘బ్యూటీ’ చిత్రం నుంచి రిలీజ్ చేసిన పోస్టర్లు, మోషన్ పోస్టర్, గ్లింప్స్, పాటలు అన్నీ కూడా ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ చిత్రం నుంచి ఓ బ్యూటీఫుల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ‘కన్నమ్మ కన్నమ్మ’ అంటూ సాగే ఈ పాటను సనారే రాయగా.. ఆదిత్య ఆర్కే, లక్ష్మీ మేఘన ఆలపించారు. ఇక విజయ్ బుల్గానిన్ హృద్యమైన బాణీ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. పాట సాహిత్యం గానీ, పిక్చరైజేషన్ గానీ, హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ గానీ ఎంతో అద్భుతంగా ఉంది. కన్నమ్మ పాట శ్రోతల్ని ఇట్టే ఆకట్టుకునేలా ఉంది.

ఆయ్, మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం వంటి హిట్ చిత్రాల్లో తనదైన మార్క్ క్రియేట్ చేసుకున్న అంకిత్ కొయ్య బ్యూటీ చిత్రంలో సోలో లీడ్‌గా అందరినీ మెప్పించేలా ఉన్నారు. ఈ చిత్రంలో నరేష్, వాసుకి, నంద గోపాల్, సోనియా చౌదరి, నితిన్ ప్రసన్న, మురళీ గౌడ్, ప్రసాద్ బెహరా వంటి వారు కీలక పాత్రలు పోషించారు.ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్‌గా శ్రీ సాయి కుమార్ దారా పని చేస్తున్నారు. విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్షన్‌: బేబీ సురేష్‌ భీమగాని, ఎడిటింగ్‌: ఎస్‌బి ఉద్ధవ్‌. ఈ ఏడాదిలో రాబోతోన్న క్రేజీ ప్రాజెక్టుల్లో ‘బ్యూటీ’ కూడా ఒకటి కానుంది. ఈ సినిమాకు బి.ఎస్. రావు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.


Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Search
Categories
తాజా వార్తలు
Leave a Comment: