Category : ఆరోగ్యం | Sub Category : ఆరోగ్యం Posted on 2025-04-07 10:36:39
తెలుగు వెబ్ మీడియా న్యూస్: కాకరకాయ.. ఈ పేరు చెప్పగానే చాలా మంది బాబోయ్ అంటుంటారు.. నాకు ఈ పూట అన్నం వద్దు అని తినటం కూడా మానేస్తుంటారు. ఎందుకంటే.. కాకరకాయలోని చేదు భయంతో చాలా మంది దాన్ని తినడానికి ఇష్టపడరు. కానీ చేదు కాకరకాయ చేసే మేలేంతో తెలిస్తే మాత్రం పచ్చిగానే లాగించేస్తారని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాకరకాయలో ఉండే పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చెబుతున్నారు. తరచూ కాకరకాయ తింటే శరీరంలో కలిగే మార్పులేంటో ఇక్కడ తెలుసుకుందాం..
కాకరకాయలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వీటిలో విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ సి బీటా కెరోటీన్ ఐరన్ పొటాషియం జింక్ మెగ్నీషియం సమృద్ధిగా లభిస్తాయి. కాకరకాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అందుకే తరచూ కాకరకాయ తినడం వల్ల మలబద్ధకం సమస్య తగ్గుతుంది. తిన్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది. అజీర్తి కూడా దరి చేరదు. కాకరకాయలో ఉన్న చేదు కడుపులో ఉన్న నులి పురుగులు ఇతర క్రిములను నాశనం చేస్తుంది.
కాకరకాయ తరచుగా తినడం వల్ల శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగి.. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుందట. కాకరకాయలో ఉండే విటమిన్ సి ఇమ్యూనిటీని పెంచుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. కాకరకాయలు తింటే ఇన్ఫెక్షన్స్ వంటివి రావు. కాకరకాయలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని తింటే ఫ్రీరాడికల్స్ వల్ల నష్టం రాదు కణాలు ఆరోగ్యంగా మారుతాయి.
కాకరకాయలో ఉండే మెగ్నీషియం పొటాషియం గుండెని ఆరోగ్యంగా ఉంచుతాయి. రక్తపోటుని కంట్రోల్ చేస్తాయి. కాకరకాయ తింటే గుండె సమస్యలు స్ట్రోక్ వంటివి రావు. కాకరకాయలో ఉండే చేదు జీవక్రియను పెంచడానికి సహాయపడుతుంది. కాకరకాయలు తినడం వల్ల బరువు కూడా అదుపులో ఉంటుంది.
కాకరకాయ క్యాన్సర్ రిస్క్‌ను కూడా తగ్గిస్తుంది. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలు పెరగకుండా క్యాన్సర్ బారిన పడకుండా చూస్తాయి. కాకరకాయలను తినడం వల్ల శ్వాస సంబంధిత సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు. ఆస్తమా జలుబు వంటి సమస్యలు కూడా రావు. హెల్తీగా ఉండవచ్చు.
కాకరకాయలో ఉండే పాలీపెప్టెడ్స్ అనేవి షుగర్ లెవెల్స్‌ను అదుపులో ఉంచుతాయి. క్రమం తప్పకుండా కాకరకాయ తింటే షుగర్ కంట్రోల్ అవుతుంది. కాకర కాయ జ్యూస్‌ను ప్రతి రోజు తీసుకోవడం వల్ల మలేరియా టైఫాయిడ్ కామెర్లు వంటి సమస్యలు రావట. కాకరకాయలో తక్కువ కేలరీలు ఉంటాయి. అందువల్ల బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్న వారికి కాకరకాయ ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.