Category : ఆరోగ్యం | Sub Category : ఆరోగ్యం Posted on 2025-04-07 10:53:54
తెలుగు వెబ్ మీడియా న్యూస్: చాలా మందికి వారి జీవనశైలి కారణంగా రోజూ బట్టలు ఉతికే తీరిక ఉండదు. దీంతో ఉద్యోగాలు చేసే చాలా మంది వారాల తరగబడి బట్టలు పోగు చేసి ఒకేసారి ఉతకడం చేస్తుంటారు. మరికొందరైతే వాటిని ఉతకకుండానే రెండు మూడు సార్లు అలాగే ధరిస్తుంటారు. ఆ తర్వాత ఉతుకుతారు. కానీ ఆరోగ్యంగా ఉండాలంటే..
చాలా మందికి వారి జీవనశైలి కారణంగా రోజూ బట్టలు ఉతికే తీరిక ఉండదు. దీంతో ఉద్యోగాలు చేసే చాలా మంది వారాల తరగబడి బట్టలు పోగు చేసి ఒకేసారి ఉతకడం చేస్తుంటారు. మరికొందరైతే వాటిని ఉతకకుండానే రెండు మూడు సార్లు అలాగే ధరిస్తుంటారు. ఆ తర్వాత ఉతుకుతారు. కానీ ఆరోగ్యంగా ఉండాలంటే ఏ రోజు బట్టలు ఆ రోజే ఉతికి శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఉతకకుండా అధిక సార్లు ధరించిన తర్వాత కూడా బట్టలు ఎక్కువకాలం ఉతకకుండా ఉంచుకోవడం అంత మంచిది కాదు. కొన్ని రకాల బట్టలను ఎక్కువగా ఉతకడం కూడా మంచిది కాదు. మంచి వస్త్రాన్ని పదే పదే ఉతకడం వల్ల అది పాడైపోతుంది. ముఖ్యంగా ఈ విధమైన ఫాబ్రిక్ త్వరగా బలహీనమై పాతదిగా కనిపిస్తుంది. కాబట్టి ఎన్నిసార్లు ధరించిన తర్వాత ఏ బట్టలు ఉతకాలి అనే విషయం ఇక్కడ తెలుసుకుందాం..
లోదుస్తులు
కొంతమంది ప్రతి రెండు రోజులకు ఒకసారి తమ లోదుస్తులను ఉతుకుతుంటారు. వ్యక్తిగత పరిశుభ్రత కారణాల దృష్ట్యా లోదుస్తులను ప్రతిరోజూ ఉతకాలి. అవి చర్మం నుంచి నూనెలను సేకరించి పది నుంచి పన్నెండు గంటల పాటు దుర్గంధాన్ని ఉత్పత్తి చేస్తాయి. అందువల్ల ఉతకని లోదుస్తులు ధరించడం వల్ల ఇన్ఫెక్షన్లతో సహా ఆరోగ్య సమస్యలు వస్తాయి. శరీర పరిశుభ్రతను కాపాడుకోవడానికి ప్రతిరోజూ లోదుస్తులను ఉతకడం మంచిది.
షర్టులు
కొంతమంది తమ షర్లును అస్సలు ఉతకరు. మీరు ధరించే చొక్కా పొరలుగా ఉండి చెమటను పీల్చుకోకపోతే దానిని ఏడుసార్లు ధరించిన తర్వాత ఉతకవచ్చు. లేకపోతే దానిని రెండు నుండి నాలుగు సార్లు ధరించని తర్వాత కూడా శుభ్రం చేయవచ్చు.
జీన్స్
చాలా మందికి జీన్స్ ఉతకడం ఒక తలనొప్పి. అందువలన వారు జీన్స్‌ను ఒకసారి ధరించిన తర్వాత ఉతకకుండానే రెండు లేదా మూడు సార్లు ధరిస్తారు. దానిని నీటిలో వేసి మాటికి మాటికీ ఉతికితే జీన్స్ వదులుగా ఉండటమే కాకుండా రంగు కూడా పోతుంది. అందుకే జీన్స్‌ను నాలుగైదు సార్లు ధరించిన తర్వాత ఉతకడం మంచిది.
టీ-షర్టులు టాప్స్
టీ-షర్టులు టాప్స్ వల్ల మెడ చేతులపై ఎక్కువ మురికి పడుతుంది. ఇందులో చాలా చెమట ధూళి చనిపోయిన చర్మ కణాలు ఉంటాయి. మీకు చెమట ఎక్కువగా పడుతుంటే దానిని ధరించిన వెంటనే శుభ్రం చేయడం మంచిది. లేకపోతే మీరు టీ-షర్టులను రెండు మూడు సార్లు ధరించిన తర్వాత అయినా ఉతకడం మర్చిపోవద్దు.
జిమ్ దుస్తులు
జిమ్ దుస్తులను ప్రతిరోజూ ఉతకడం మంచిది. మీరు జిమ్‌లో ఎక్కువ సమయం గడుపుతారు కాబట్టి ఈ బట్టలు చెమటను పీల్చుకుంటాయి. చెమట దుర్వాసన కారణంగా మీరు ఒకసారి ధరించిన దుస్తులను మళ్ళీ ధరించలేకపోవచ్చు. కాబట్టి జిమ్ దుస్తులను తప్పనిసరిగా ఒకసారి ధరించిన తర్వాత ఉతకడం మంచిది.