Category : సినిమా | Sub Category : సినిమా Posted on 2025-04-03 10:13:24
తెలుగు వెబ్ మీడియా న్యూస్: న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం హిట్ 3 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా ఇప్పటివరకు చూడని పాత్రలో నాని కనిపించనుండడంతో మూవీపై అంచనాలు మరింత ఎక్కువయ్యాయి.
న్యాచురల్ స్టార్ నాని సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హాయ్ నాన్న హిట్ తర్వాత ఈ హీరో నటిస్తున్న లేటేస్ట్ మూవీ హిట్ 3. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు నాని. టీజర్ పోస్టర్లతోనే మూవీపై ఓ రేంజ్ హైప్ క్రియేట్ చేసిన మేకర్స్.. ఈసారి ఈ చిత్రంలో నాని మరింత కొత్తగా చూపించనున్నారు. డైరెక్టర్ శైలెష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తుంది. కొన్ి నెలలుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది. ఈ క్రమంలో తాజాగా నాని కొత్త సినిమాల గురించి ఆసక్తిరక అప్డేట్స్ వస్తున్నాయి.
ప్రస్తుతం ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం.. నాని నటిస్తున్న హిట్ 3 చిత్రంలో కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ స్పెషల్ రోల్ చేయనున్నాడట. ఈ సినిమాలో కార్తీ పాత్ర చాలా ముఖ్యమైనదని.. వీరిద్దరి కాంబోలో సీన్స్ ఉంటాయని అంటున్నారు. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే హిట్ 3లో కీలకపాత్రలో కార్తీ కనిపిస్తాడని.. ఆ తర్వాత ఆ చిత్రానికి కొనసాగింపుగా వచ్చే హిట్ 4లో ప్రధాన పాత్ర పోషిస్తాడని అంటున్నారు. నాని హిట్ చిత్రం హిట్ 3 మే 1 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తమిళం తెలుగు మలయాళం కన్నడ హిందీ సహా వివిధ భాషలలో విడుదలవుతోంది.
ఇక కార్తీ సినిమాల విషయానికి వస్తే.. అతడు చివరిసారిగా మెయియఝగన్ (సత్యం సుందరం) చిత్రంలో కనిపించాడు. ఇందులో అరవింద్ స్వామి శ్రీ దివ్య కీలకపాత్రలు పోషించారు. విడుదలైన తర్వాత ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సాధించకపోయినా సమీక్షల పరంగా మొత్తం ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకుంది. దర్శకుడు పి.ఎస్. మిత్రన్ దర్శకత్వం వహించిన సర్దార్ 2 చిత్రంలో కూడా ఆయన నటించారు.