Category : క్రీడలు | Sub Category : జాతీయ Posted on 2025-04-08 11:56:16
తెలుగు వెబ్ మీడియా న్యూస్:-పటౌడీ ట్రోఫీని రిటైర్ చేయాలని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నిర్ణయించడంపై భారత మాజీ కెప్టెన్ గావస్కర్ మండిపడ్డాడు. ఈసీబీ నిర్ణయంలో సున్నితత్వం లోపించిందని అన్నాడు.
ముంబయి: భారత్-ఇంగ్లాండ్ టెస్టు క్రికెట్కు 75 ఏళ్ల పూర్తయిన సందర్భంగా 2007 నుంచి పటౌడీ ట్రోఫీని ఇవ్వడం ఆరంభించారు. ఈ రెండు దేశాల మధ్య ఇంగ్లాండ్లో జరిగే టెస్టు సిరీస్ విజేతకు ఈ ట్రోఫీని బహూకరిస్తున్నారు. అయితే ఈ ఏడాది జూన్-జులైలో జరిగే అయిదు టెస్టుల సిరీస్ నుంచి ఈ ట్రోఫీ పేరును మార్చాలని ఈసీబీ నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి. ఓ ఆటగాడి పేరుతో ఉన్న ట్రోఫీని రిటైర్ చేయడం గురించి వినడం ఇదే మొదటిసారి. వాళ్లలో సున్నితత్వం పూర్తిగా లోపించిందని చెప్పడానికి ఇది నిదర్శనం. భారత్, ఇంగ్లాండ్లో క్రికెట్కు పటౌడీ ఎంతో చేశారు. ట్రోఫీకి వేరే ఆటగాళ్ల పేర్లు పెడతారు కావొచ్చు. ఈ విషయంపై ఈసీబీ ఏ భారత ఆటగాణ్ని సంప్రదించినా.. అందుకు అతడు తిరస్కరించాలి అని గావస్కర్ అన్నాడు.