Responsive Header with Date and Time

ఉల్లిపాయే కదా అని చీప్‌గా చూడకండి.. ఆ సమస్యలకు అద్భుతమైన బ్రహ్మాస్త్రం.. తెలిస్తే వదిలిపెట్టరు

Category : ఆరోగ్యం | Sub Category : ఆరోగ్యం Posted on 2025-04-08 15:34:02


ఉల్లిపాయే కదా అని చీప్‌గా చూడకండి.. ఆ సమస్యలకు అద్భుతమైన బ్రహ్మాస్త్రం.. తెలిస్తే వదిలిపెట్టరు

తెలుగు వెబ్ మీడియా న్యూస్:    ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు.. ఈ సామేతను మనం తరచూ వింటుంటాం. అయితే.. ఉల్లిపాయలో ఉన్న సహజ ఔషధాలు పోషకాల వల్ల ఇలా చెబుతుంటారు.. వీటిలో అనేక ఔషధాలతోపాటు యాంటీ బాక్టీరియల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. దీంతోపాటు ఆరోగ్యానికి మేలు చేసే ఖనిజాలు సల్ఫర్‌ లాంటి ఎన్నో పోషకాలు దాగున్నాయి.

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు.. ఈ సామేతను మనం తరచూ వింటుంటాం. అయితే.. ఉల్లిపాయలో ఉన్న సహజ ఔషధాలు పోషకాల వల్ల ఇలా చెబుతుంటారు.. వీటిలో అనేక ఔషధాలతోపాటు యాంటీ బాక్టీరియల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. దీంతోపాటు ఆరోగ్యానికి మేలు చేసే ఖనిజాలు సల్ఫర్‌ లాంటి ఎన్నో పోషకాలు దాగున్నాయి. అవన్నీ తెలియకపోయినా.. ఉల్లిని ప్రతి ఒక్కరూ ఆహారంలో ఉపయోగిస్తుంటారు. అయితే వేసవిలో ఉల్లిపాయ తినడం వల్ల అనేక సమస్యల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. సల్ఫర్ ఫైబర్ పొటాషియం కాల్షియం విటమిన్ బి సి వంటి పోషకాలతో కూడిన ఉల్లిపాయ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని.. కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

వేసవి కాలం ప్రారంభమైంది.. ఎండలు దంచికొడుతున్నాయి.. ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు వేడిని నివారించడానికి అనేక జాగ్రత్తలు తీసుకుంటుంటారు.. వాస్తవానికి వేసవిలో వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో దీనిని నివారించడానికి ఎక్కువ పోషకాహారం అవసరం. ఇటువంటి పరిస్థితుల్లో వేసవిలో ప్రతిరోజూ ఒక పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల అనేక సమస్యల నుండి బయటపడవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వేసవిలో ఉల్లిపాయలు తినడం మంచిది.. ఉల్లిపాయ చల్లదనాన్ని అందిస్తుంది.. ఇది వేసవిలో శరీరాన్ని లోపలి నుండి చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది. వేసవి కాలంలో ఉల్లిపాయ తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉంటుంది.. చెమట తగ్గుతుంది. అయితే వేసవిలో ఉల్లి పాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకోండి..

వేసవిలో ఉల్లిపాయ ప్రయోజనాలు..

హీట్ స్ట్రోక్ ను నివారిస్తుంది: వేసవిలో ఉల్లిపాయలు తినడం వల్ల హీట్ స్ట్రోక్‌ను నివారించవచ్చు. వేసవి కాలంలో వేడి గాలుల ప్రమాదం పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో పచ్చి ఉల్లిపాయ శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తుంది.. హీట్ స్ట్రోక్ నుండి మిమ్మల్ని రక్షిస్తుంది.

శరీరాన్ని చల్లబరుస్తుంది: ఉల్లిపాయ చల్లని స్వభావాన్ని కలిగి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో వేసవిలో దీన్ని తినడం వల్ల మీరు సహజంగా చల్లగా మారుతారు.. దీన్ని తినడం వల్ల మీరు రోజంతా తాజాగా ఉంటారు.

జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది: ఉల్లిపాయలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. వేసవిలో కడుపు సమస్యలు పెరుగుతాయి. అటువంటి పరిస్థితిలో దీన్ని తినడం వల్ల మలబద్ధకం వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది: ఉల్లిపాయలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి ఉంటాయి.. ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.. వేసవి కాలంలో వచ్చే వ్యాధులను నివారించడంలో ఉల్లి సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Search
Categories
తాజా వార్తలు
Leave a Comment: