Category : ఆంధ్రప్రదేశ్ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2025-04-08 11:20:54
తెలుగు వెబ్ మీడియా న్యూస్:- రాజధాని అమరావతి అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం రూ.4,200 కోట్లు విడుదల చేసింది. ఇటీవల ప్రపంచ బ్యాంకు నుంచి తొలి విడత రుణం కింద రూ.3,535 కోట్లు వచ్చాయి. వీటికి కేంద్ర నిధులు కూడా తోడవ్వడంతో రాజధాని పనులు ఊపందుకోనున్నాయి. గత నెల దాదాపు 70 పనులకు సంబంధించి రూ.40వేల కోట్ల విలువైన నిర్మాణ పనులకు సీఆర్‌డీఏ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
అమరావతి రాజధాని నగరంలో ఫేజ్1 అభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు కలిసి 1600 మిలియన్ డాలర్లు (రూ.13,600 కోట్లు) నిధులిచ్చేందుకు గతంలోనే అంగీకరించాయి. ఇందులో ఒక్కో బ్యాంక్ 800 మిలియన్ డాలర్ల మేర నిధులు సమకూర్చడానికి అంగీకరించాయి. అయితే అమరావతి తొలి దశ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలను కేటాయించగా.. మరో రూ.1,400 కోట్లను తమ నిధుల నుంచి కేంద్రం కేటాయిస్తోంద.